Home ట్రైలర్స్ ‘వైఫ్ ఆఫ్ రామ్’ పై రాజమౌళి ప్రశంసల జల్లు

‘వైఫ్ ఆఫ్ రామ్’ పై రాజమౌళి ప్రశంసల జల్లు

146
SHARE

దర్శకుడు రాజమౌళి మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన వైఫ్ ఆఫ్ రామ్ ట్రైలర్ పై ప్రశంసల జల్లు కురిపించారు. ట్రైలర్ చూస్తుంటేనే ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్ లా ఉందని పొగిడేశారు. టేకింగ్ ఇంటిలిజెంట్ గా ఉందని, ఇలాంటి కొత్త తరహా కథ ఎంచుకున్న దర్శకుడు విజయ్ యెలకంటికి, సినిమా టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ పెట్టాడు రాజమౌళి..

వైఫ్ ఆఫ్ రామ్ ఓ సైకలాజికల్ థ్రిల్లర్. ఈ తరహా కథలు మన దగ్గర ఇంత వరకూ రాలేదు. ఇంటెన్సివ్ గా సాగే కథనం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా చిత్ర టీమ్ ముందు నుంచీ చెబుతోంది. మొత్తంగా రాజమౌళిని మెప్పించిన వైఫ్ ఆఫ్ రామ్ ఆడియన్స్ నూ ఆకట్టుకోవడానికి త్వరలోనే విడుదల కాబోతోంది. వైఫ్ ఆఫ్ రామ్ గా మంచు లక్ష్మి నటించిన ఈ చిత్రంలో ఇంకా సమ్రాట్ రెడ్డి, ప్రియదర్శి, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు నటిస్తున్నారు.