Home రాజకీయాలు జగన్ గ్రేటెస్ట్ కాదు.. ఎవరెస్ట్.. పోసాని ప్రూఫ్!

జగన్ గ్రేటెస్ట్ కాదు.. ఎవరెస్ట్.. పోసాని ప్రూఫ్!

SHARE

వైకాపా అధినేత జగన్ పై ప్రముఖ సినీ రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత పోసాని కృష్ణమురళి ప్రశంశల జల్లులు కురిపించారు. అలా అని రాజకీయ ప్రసంగాలు చేస్తు అడ్డగోలుగా పొగడ్తల వర్షాలు కురిపిస్తూ, భజన కార్యక్రమాలకు తెరలేపడం కాదు సుమా… జగన్ గురించి తనకు తెలిసిన ఒక విషయం, జగన్ తో తాను సంబాషించిన ఒక సంఘటన గురించి.. తన భార్య బిడ్డల సాక్షిగా వాస్తవం చెబుతున్నానని చెబుతూ పోసాని ప్రశంసించారు. జగన్ కు స్పష్టత ఉందని, ఒక విషయాన్ని అనవసరంగా ఎత్తుకుని, అనంతర కెలిగి వదిలేసే మనస్థత్వం కాదని, చేయగలిగేదే చెబుతారు తప్ప.. ఓట్లకోసం సాధ్యంకాని హామీలు ఇవ్వరు అని పోసాని తనకు జరిగిన అనుభవాన్ని తెలియజేశారు!

వివరాళ్లోకి వెలితే… తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన పోసాని.. చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయకూడదో, జగన్ కు ఎందుకు ఓటు వేయాలో చెప్పే క్రమంలో.. తనకు జగన్ తో జరిగిన సంబాషణను, అనుభవాన్ని వివరించారు. చాలా మంది వ్యక్తులు… “మా నాన్న లాగా నేను కూడా అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాను” అని జగన్ తో ప్రకటించమని చెప్పండి.. వెంటనే జగన్ సీఎం అవుతారు.. అని పోసానికి సూచించారట. దీంతో.. అది సాధ్యమా అసాధ్యమా అని ఆలోచించని పోసాని… ఈ విషయాన్ని పాదయాత్రలో ఉన్న జగన్ తో పంచుకున్నారట. ఆ సమయంలో జగన్ చెప్పిన ఒక మాట వల్ల.. జగన్ అనే వ్యక్తి గ్రేటెస్ట్ కాదు.. ఎవరెస్ట్ అని తనకు అనిపించిందని చెప్పుకొచ్చారు పోసాని.

ఇంతకూ జగన్ చెప్పిన సమాధానం ఏమిటంటే… “అన్నా ప్రాక్టికల్ గా రుణమాఫీ అనేది సాధ్యం కాదు.. నాన్న గారి రోజుల్లో ఉన్న రైతు రుణాలు, రాష్ట్ర ఆదాయం వేరు.. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితులు, ఉన్న రుణాలు వేరు. రుణమాఫీ అనే ప్రక్రియ ప్రాక్టికల్ గా సాధ్యం కాదు. కేవలం రుణమాఫీ అని అసాధ్యమైన పనిని తాను చేస్తానని చెప్పి ఓట్లు గుంచుకుని, కుర్చీ లెక్కి తప్పించుకుని తిరగలేను.. రుణమాఫీ కంటే బెటర్ ఆలోచన రైతులకు చేస్తాను.. చెసేదే చెప్పాలి, చెప్పింది చేయాలి.. అలాకాని పక్షంలో ప్రజలను ఓట్ల కోసం మోసం చేయకూడదు” అని! ఈ మాటలు విన్న పోసాని… రాష్ట్రానికి ఇలాంటి నిజాయితీ కలిగిన నాయకుడు కావాలని, జగన్ కు ఉన్న స్పష్టత అద్భుతమని… అనంతరం జగన్ గ్రేటెస్ట్ కాదు.. ఎవరెస్ట్ లాంటి వ్యక్తి అని ఫిక్సయిపోయారంట.