Home రాజకీయాలు విలువలు లేవంటూ భారత రత్న ఎలా రికమెండ్ చేస్తారు: పోసాని!

విలువలు లేవంటూ భారత రత్న ఎలా రికమెండ్ చేస్తారు: పోసాని!

231
SHARE

నటుడు రచయిత, దర్శకుడు పోసాని కృష్ణ మురళి తనదైన స్టైల్ లో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ని విమర్శించారు. గతంలో నాయుడు ఎన్.టి.రామారావుకు విలువలు లేవని అన్న మాటలు గుర్తు చేస్తూ దానికి సంబందించిన పేపర్ క్లిప్పింగ్ లు చూపి ఓ వైపు ఎన్.టి.ఆర్.ను అనరాని మాటలతో దూషించి, ఇప్పుడు ఆయన ఇంత గొప్పవాడని, అంత గొప్పవాడని భారతరత్న ఇవ్వాలని అడిగతమేమిటని పోసాని అన్నారు.

ఎన్.టి.ఆర్.కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి తమ తండ్రి ఎన్.టి.ఆర్. విలువలు ఉన్న వ్యక్తని చెప్పాలని, లేకుంటే ఎన్.టి.ఆర్ కు విలువలు లేనట్లే అంతా అనుకుంటారని పోసాని అన్నారు. అయితే తాను మాత్రం ఎన్.టి.ఆర్.విలువలు ఉన్నవ్యక్తి అని ఖచితంగా నమ్ముతున్నామని అన్నారు.

కమ్మ వాళ్లు కూడా దీనిపై స్పందించాలని, ఎన్.టి.ఆర్.విగ్రహానికి పాలభిషేకం చేయాలని పోసాని కోరారు. గతంలో వాజ్ పేయితో కలిసి పోటీచేసి ఆ తర్వాత విడిపోయి, వాజపేయి ని నిందించి, బిజెపిని దూషించి ,ముస్లింలకు అన్యాయం చేశారని అన్నారని వాపోయారు. ఇప్పుడు కూడా మోడీ తో ఇన్నాళ్లూ అంటకాగి ఇప్పుడు విడిపోయి ఆయనను దూషిస్తున్నారని పోసాని పేర్కొన్నారు!