Home సినిమా శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు.. ఆ చెత్త సిగ్గుచేటు

శ్రీరెడ్డికి నాని లీగల్ నోటీసులు.. ఆ చెత్త సిగ్గుచేటు

SHARE

గత కొద్దికాలంగా నేచురల్ స్టార్ నానీపై సినీ నటి శ్రీరెడ్డి దారుణమైన కామెంట్లతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే బిగ్‌బాస్‌కు ముందు ఓ టెలివిజన్ ఛానెల్‌లో తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో హీరో నాని పరోక్షంగా స్పందించినట్టు అర్ధమవుతున్నది. బిగ్‌బాస్2 కార్యక్రమం ఆదివారం రాత్రి ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నాని సదరు హీరోయిన్‌పై ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. నాని చేసిన ఘాటైన కామెంట్లు ఇటీవల సినీ పరిశ్రమపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన నటిని ఉద్దేశించి చేసినవని సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

నాని ట్విట్టర్‌లో పోస్టు చేసిన లీగల్ నోటీసుకు సంబంధించిన దానికి శ్రీరెడ్డి తిరుగు జవాబిచ్చింది. తప్పుకుండా మనం లీగల్‌గా ఫైట్ చేద్దాం అని నానీ ట్వీట్‌ను రీట్వీట్ చేయడం గమనార్హం.