Home రాజకీయాలు జూపూడిది అజ్ఞానమా.. ఆత్మవంచనా?

జూపూడిది అజ్ఞానమా.. ఆత్మవంచనా?

SHARE

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు! స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే దళితులను చులకన చేసిన మాట్లాడిన దౌర్భాగ్య పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొన్నాయి. ఈ వాస్తవాలు అన్నీ జూపూడి ప్రభాకర్ కు తెలియదని అనుకోలేం. తెలిసి కూడా ఆత్మవంచన చేసుకుంటున్న జూపూడి ప్రభాకర్.. తాజాగా ఎస్సీ ఎస్టీలపై చంద్రబాబుది మామూలు ప్రేమ కాదు అనే రేంజ్ లో చెబుతూ… వైకాపా ఎస్సీల వ్యతిరేకి అని మాట్లాడటం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో జూపూడి తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

“దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా” అంటూ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు దుర్మార్గపు మాటలు మాట్లాడారు! జూపూడి చెబుతున్నట్లు చంద్రబాబుకు దళితులపై అంత ప్రేమే ఉంటే… తాను దళితుడిగా పుట్టాలని అనుకుంటున్నాను అనొచ్చు కదా.. పోనీ అంత పెద్ద మనసులేకపోతే.. దళితులకు అగ్రవర్ణాలన్నీ అండగా ఉండాలని, రాష్ట్రంలో కులవివక్ష పోవాలని ప్రసగింగించొచ్చు కదా! ఇదే అదనుగా మంత్రి ఆదినారయణ రెడ్డి… దళితులు శుభ్రంగా ఉండరంటూ తనకున్న అజ్ఞానంతో ఒక మాట మాట్లాడారు.. ఇవన్నీ జూపూడికి తెలియదా? వారిద్దరూ అన్నది తనను కాదులే అని ఆత్మవంచన చేసుకుంటున్నారా?

ఇక వైకాపా దళిత వ్యతిరేకి అని అవగాహనరాహిత్యపు మాటలు మాట్లాడిన జూపూడికి… జగన్ ప్రసంగాలు విన్న అనుభవం లేదా? తన కుటుంబంలో తన తండ్రి సోదరులు ఎస్సీలనే పెళ్లిల్లు చేసుకున్నారని… తాను “మామా” అని పిలిచేవారిలో ఎస్సీలే ఎక్కువని జగన్ గర్వంగా చెప్పుకుంటున్నారు. తనకు కులమతాలు లేవని, అంతా సమానమే అనే సందేశాన్ని ప్రజలకు పంపడంతో పాటు.. తాను దళితుల కుటుంబ సభ్యులలో ఒకడిని అనే భరోసా కల్పించారు. దీన్ని బట్టి అయినా జూపూడికి అర్ధం కాకపోవడం.. ఆయన అజ్ఞానం అనుకోవాలా? లేక ఆత్మవంచన చేసుకుంటున్నారని అనుకోవాలా?

ఇక బాబు పాలనలో లెక్కల సంగతి చూసుకుంటే… చంద్రబాబు నాలుగేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు వేల సంఖ్యలో నమోదు కావటం తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న సంగతి జూపూడి తెలుసుకోవాలి! ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలు ప్రకారం చూసుకుంటే… బాబుపాలనలో ఎస్సీ, ఎస్టీలపై దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోందని స్పష్టం అవుతుంది. 2016–17లో ఎస్సీ, ఎస్టీలపై 2,332 నేరాలు జరిగితే.. 2017–18లో ఇది 3,289కి పెరిగిపోయాయి. ఇవి కేవలం ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన గణాంకాలు మాత్రమే.. ఇక వెలుగులోకి రాని ఘటనలు ఎన్నో జూపూడే ఆలోచించుకోవాలి!! ఈ విషయాలను మరిచిన జూపూడి… వైకాపా ఎస్సీల వ్యతిరేకి అని మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!