Home రాజకీయాలు బీసీ లను తెదేపా నించి దూరం చేయటానికి కుట్ర…! అబ్బా..చ్ఛా!!

బీసీ లను తెదేపా నించి దూరం చేయటానికి కుట్ర…! అబ్బా..చ్ఛా!!

341
SHARE

వెనుకబడిన తరగతుల వారిని తెలుగుదేశం పార్టీ నించి దూరం చేయడానికి భయంకరమైన కుట్ర జరుగుతోందని ఆర్దిక మత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. వైసీపీ పై ధ్వజమెత్తుతూ బీసీ నేత యనమల వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రయత్నాలు ఏవీ ఈ విషయంలో ఫలించవని తేల్చి చెప్పారు….మరి భయమెందుకనో.

ఆర్ధిక మంత్రి తెలుగుదేశం విధానాలను సమర్ధిస్తూ పార్టీ విధానాల వల్లే బిసి వర్గాలలో ఆత్మ గౌరవం పెరిగిందన్నారు. బీసీలు ఎప్పటికి తెలుగుదేశం పార్టీని వీడరని నమ్మకం వ్యక్తం చేశారు.

తెదేపా తో పొత్తున్నప్పుడే భాజపాకి ఏపీలో రెండు ఎంపీ సీట్లు, నాలుగు అసెంబ్లీ సీట్లు వచ్చాయని చెప్పి, కలిసి పోటీచేస్తేనే భాజపాకు సింగిల్‌ డిజిట్‌ లో సీట్లు వస్తే, ఇక విడిగా పోటీచేస్తే ఎలా ఉంటుందో చెప్పక్లర్లేద౦టూ వ్యాఖ్యానించారు.

బిసిలకు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఏమీ చేయలేదని అన్నారు …చేయటానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టి ఐదు సంవత్సరాలే కదా అయింది…గవర్నమెంట్ లో కూడా లేదు…అయితే పవర్ లోకి వస్తే ఎం చేయగలరో జగన్ చెప్తూ వస్తున్నారు, చేయగలిగితేనే హామీ ఇస్తున్నారు. ఇక బీసీ లకు తమ పార్టీ ఎం చేసిందో, లేక చేస్తోందో చెప్పకుండా …ఇదేమి వయ్యారాలు యనమల?