Home రాజకీయాలు ప్రస్తుతం మీరే సీఎం.. మరిచారా బాబు?

ప్రస్తుతం మీరే సీఎం.. మరిచారా బాబు?

440
SHARE

ఏపీ వాసుల పరిస్థితి ఏమిటో కానీ… అధికారంలో ఉండి పనులు చేస్తూ, పరిపాలన సక్రమంగా చేయాల్సిన వారు ఆరోపణలు చేస్తుంటే… ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తూ, తప్పులను ఎత్తుచూపుతూ ఆరోపణలు చేయాల్సిన ప్రతిపక్షం.. ప్రజలతరుపున పోరాటాలు చేస్తూ, కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తుంది.. ప్రజలకు భరోసా కల్పిస్తుంది. ఇదే బాగుందనుకున్నారో లేక.. ఆరోపణలకు ఆరోపణలే సమాధానాలు అనుకున్నారో ఏమో కానీ… తనకు అధికారం చేతిలో ఉందన్న విషయం రోజు రోజుకీ మరిచిపోతున్నట్లున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు! తాజాగా ఆయన వైకాపా నేతలపై చేసిన ఆరోపణలు… ఇదే విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి.

అధికారం చేతిలో ఉన్నప్పుడు, ప్రజలు పవర్ చేతికిచ్చినప్పుడు… రాష్ట్రంలో అన్యాయాలు, అక్రమాలు జరుగుతుంటే బాబు సీరియస్ గా పరిగణలోకి తీసుకోవాలి. ఆ దారుణాలకు పాల్పడిన వారు ఎంతటివారైనా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అంతేకానీ… ఆ దారుణాలు ఎవరు చేశారో, ఎందుకు చేశారో క్లారిటీ లేకుండా వాటిని కూడా రాజకీయ ప్రసంగాలకు వాడుకోకూడదు! అలా చేయడం వల్ల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లడంతోపాటు.. బాబు చేతకానితనం, అసమర్ధత తేటతెల్లం అవుతుంది. ఈ విషయాలను మరిచిన చంద్రబాబు… రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా దానికి ప్రతిపఖ నాయకులే కారణం అని చెప్పుకుని గడిపేస్తున్నారు.

వైసీపీ పోలవరం, పట్టిసీమకు అడ్డంకులు పెడుతుంది.. రాజధానిలో చెరకు తోటలు కాల్చేశారు.. పోలవరం కుడికాలువకు గండి కొట్టారు.. జగన్ తో పాటు వైసీపీ నేతలు అంతా ముద్దాయిలే..! అంటూ ఊకదంపుడు ఉపన్యాశాలు చేస్తున్నారు!! పోలవరం పట్టిసీమలకు అడ్డంకులు సృష్టిస్తుంటే.. వాటిపై క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రాజధానిలో చెరకు తోటలు కాలిపోతే.. వాటిపై సమగ్ర దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోలేరా? పోలవరం కుడి కాలువకు గండి కొట్టింది నిజమైతే.. ప్రభుత్వం చూస్తూ ఎందుకుండిపోయింది.. ఇవన్నీ బాబు చేయాల్సిన పరిష్కారాలు, పనులు అని గ్రహించని బాబు… అధికారం చేతిలో ఉండి కూడా.. ప్రతిపక్ష పార్టీల్లాగా ఆరోపణలకే పరిమితమవుతూ, తద్వారా తన అసమర్ధతను చాటుకుంటున్నారు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి!!