Home రాజకీయాలు ఏపీ ప్రజల భవిష్యత్తుతో బాబు జూదం!!

ఏపీ ప్రజల భవిష్యత్తుతో బాబు జూదం!!

238
SHARE

చంద్రబాబు గతకొన్ని రోజులుగా ప్రజాధనంతో నిర్వహిస్తున్న ప్రచార యాత్రలైన నవనిర్మాణ దీక్షల్లో… తనకు పాతిక ఎంపీస్థానాలు కావాలని ప్రజలకు విన్నవిస్తున్నారు. ఇస్తే చేసేదేమిటయ్యా… అని అడిగిన ప్రశ్నలకు మాత్రం.. న్యాయం చేయించుకుందాం అని సమాధానమిస్తున్నారు. ఆ న్యాయమేమిటి? ఒకవేళ ఆ న్యాయం ప్రత్యేక హోదానే అయితే కనుక అది ఎట్టిపరిస్థితుల్లోనూ రాదనే సంకేతాలు తాజాగా వెలువడుతున్నాయి. ప్రత్యేక హోదా ఒక రాష్ట్రానికి ఇవ్వాలంటే ఉండాల్సిన అర్హతలు.. బాబు చెబుతున్న తాజా లెక్కలప్రకారం ఏపీకి లేవనేది ఆ వాదన సారాంశం.

ఈ క్రమంలో చంద్రబాబు చెబుతున్న మాట… ఎట్టిపరిస్థితుల్లోనూ రాబోయే ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదని.. అంటే కచ్చితంగా యూపీఏ కూటమి అధికారంలోకి రావొచ్చు అని! ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. ఏపీకి హోదా వస్తుందా.. రావడానికి అనుకూలమైన అంశాలు ఏపీలో ఉన్నాయా? అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా ఉంది! సరే కాసేపు కేంద్రంలో కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వచ్చింది, రాహుల్ గాంధీ పీఎం అయ్యారు అనుకుందాం! యూపీఏ కూటమికి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీకి ఆ అవకాశం కాంగ్రెస్ కల్పిస్తుందా? అనేది ఇక్కడ మరో ప్రశ్న! ఎందుకంటే… బాబుకు కాంగ్రెస్ పార్టీ అవసరం కానీ, కాంగ్రెస్ కు బాబు అవసరం ఉండదు! సరే… అయినా కూడా ఏపీకి సాయం చేద్దాం.. హోదా ఇద్దాం అని కాంగ్రెస్ పార్టీ అనుకుంది అనుకుంటే… దానికి సరిపడా అర్హతలు ఏపీకి లేవు! ఎందుకంటే..బాబు చెబుతున్న లెక్కలు.. పక్కన బీహార్, ఒరిస్సాలు చేసుకుంటున్న విజ్ఞప్తులు అలా ఉనాయి!

పద్దెనిమిదిలక్షల యాభైవేల కోట్ల పెట్టుబడులు సంపాదించామని చెబుతున్న చంద్రబాబు మాటలు వాస్తవాలైతే… ఇంత భారీ మొత్తంలో పెట్టుబడులు వచ్చిన రాష్ట్రానికి పన్ను రాయితీలు కేంద్రం ఇస్తుందా? ఇస్తుంటే గనుక కష్టాల్లో ఉన్న పేద రాష్ట్రాలని చెప్పుకుంటున్న బీహార్, ఒరిస్సాలు ఒప్పుకుంటాయా అనేది మరో ప్రశ్న. ఇక బాబు చెబుతున్న అభివృద్ధి లెక్కల్లో రాష్ట్ర జీడీపీ రూ. 1,00,254గా ఉండగా.. జాతీయస్థాయిలో మొత్తం జీడీపీ రూ. 1,12,756గా ఉంది. అంటే సరాసరిన చూసుకుంటే ఏటా సుమారు 30000 రూపాయలు ప్రతీ ఏటా ఎక్కువ సంపాదిస్తున్న రాష్ట్రంగా ఏపీ ఉంది. ఈ లెక్కలు, ఈస్థాయి అభివృద్ధి ఉన్న పరిస్థితుల్లో… బాబు ఏ వాదన చెప్పి కేంద్రంవద్ద హోదా అడుగుతారు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నరు. ఈ విషయాలపై క్లారిటీ ఇవ్వని బాబు… రాబోయే ఎన్నికల్లో 25ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రాదు అని చెబుతున్నమాటలను ప్రజలు ఎందుకు విశ్వసించాలో చంద్రబాబే చెప్పాలి!! కేంద్రంన్ని ఒప్పించే లాజిక్ ఏమిటో ప్రజలకు వివరించాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

అలా కాదు… విభజన చట్టంలో హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది అంటారా? ఆ లెక్కన చూసుకుంటే… కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా కూడా మనకు సమర్ధత ఉంటే.. ఇప్పుడు కూడా సంపాదించుకోవచ్చు. కలిసి ఉన్న ప్రభుత్వం, అనుకూలమైన ప్రభుత్వం నాలుగేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సంపాదించలేని ఈ హక్కులు… రాబోయే ప్రభుత్వం ఏ పార్టీదో, ఏ కూటమిదో తెలియకుండా… ఏపీ ప్రజల భవిష్యత్తుతో జూదం ఆడాలని బాబు నిర్ణయించుకోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి!!