Home రాజకీయాలు బాబుని సూటిగా ప్రశ్నిస్తున్న వైవీ!

బాబుని సూటిగా ప్రశ్నిస్తున్న వైవీ!

134
SHARE

తానుచేయాల్సిన పని, ప్రజలు వారిని పూర్తిగా నమ్మి ఇచ్చిన బాధ్యత, చేస్తామని వారు ఇప్పటికే మాట ఇచ్చిన పరిస్థితి… ఈ క్రమంలో పూర్తి బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? అధికార పక్షం! అవును… ప్రత్యేక హోదా ఇస్తామని, తెస్తామని చెప్పిన పార్టీలు బీజేపీ – టీడీపీ! ఎన్నికలు అయ్యాయి, వీరి మాటలు నమ్మిన జనాలు వారిని కుర్చీలెక్కించారు.. నాలుగేళ్లు గడిచాయి.. ఇప్పుడు రాదని వారు, తేలేక.. మోసం చేశారని వీరు చెప్పుకుంటూ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వం బాద్యత మరిచినా.. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా హోదాకోసం అలుపెరగని పోరాటం చేస్తుంది వైకాపా. ఇందులో భాగంగా తమ ఎంపీలతో రాజినామాలు కూడా చేయించారు జగన్. వాటిని ఆమోదించాల్సింది స్పీకర్.. ఈ విషయాలు తెలిసిన చంద్రబాబు కూడా… రాజినామాల డ్రామాలు ఆపాలని చెప్పుకొస్తున్నారు. ఈ విషయాలపై వైకాపా ఎంపీ వైవీ సుబ్బారెడ్డి.. బాబును సూటిగా ప్రశ్నించారు!

వైకాపా ఎంపీల రాజినామాల్లో ఎంత చిత్తశుద్ధి ఉన్నప్పటికీ… వారి నిబద్దతను చూసి జీర్ణించుకోలేని టీడీపీ నేతలు… వాటిని డ్రామాలుగా కొట్టిపారేస్తూ, అర్ధరహిత విమర్శలు చేస్తున్నారు. వారు చేయలేనిపని, వారికి చేతకాని పని చేస్తున్న వారిని వీలైతే అభినందించాలి, ఆపని చేయడానికి ముఖం చెల్లకపోతే… మౌనంగా ఉండాలి. అంతే కానీ.. ఇలా అడ్డగోలుగా విమర్శిస్తూ.. తమ చేతకాని తనాన్ని చెప్పకనే చెబుతున్నారు టీడీపీ నేతలు! ఈ క్రమంలో మా సంగతి అటుంచండి.. అసలు మీరేమి చేయబోతున్నారు అని ప్రశ్నిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి.

తాజాగా వైకాపా ఎంపీలపై చంద్రబాబు చేసిన విమర్శలపై ఫైరయిన వైవీ సుబ్బారెడ్డి… వైఎస్సార్‌సీపీనే ఎన్టీఏపై అవిశ్వాసం తీర్మానం పెట్టిందన్న విషయాన్ని గుర్తుచేశారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం బాబు ప్రత్యేక హోదాను పక్కనపెట్టిన చంద్రబాబు వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. హోదా కోసం తమతో కలిసి రాజీనామాలు చేయాలని టీడీపీని కోరగా… వారంతా పారిపోయారని.. ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఎద్దేవాచేశారు! ఆ సంగతులు అలా ఉంటే… అసలు హోదా కోసం టీడీపీ ఎంపీలు ఇప్పుడేం చేస్తారో చంద్రబాబు చెప్పాలి అని సుబ్బారెడ్డి సూటిగా నిలదీశారు. ఈ విషయాలపై మాత్రం టీడీపీ నేతలు కానీ, చంద్రబాబు కానీ మాట్లాడలేని పరిస్థితి!

రాబోయే ఎన్నికల్లో 25ఎంపీ సీట్లు కావాలి అని కొంగజపాలు చేస్తున్నారే తప్ప… ఇప్పుడు ఉన్న ఎంపీలతో ఏమి చేయబోతున్నారనే విషయంపై మాత్రం బాబు అండ్ కో నోరు మెదపడం లేదు! ఈ విషయాలను మరిచిన చంద్రబాబు.. హోదా విషయాన్ని ఇప్పుడుకూడా ప్రచారానికే వాడుకుంటున్నారు తప్ప.. ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడం లేదు! పైగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న వైకాపా ఎంపీలపై మాత్రం అవాకులు, చెవాకులు పేలుతున్నారు!! దీంతో.. వైవీ సుబ్బారెడ్డి సంధించిన సూటి ప్రశ్నకు… బాబు సమాధానం చెప్పి తీరాలని పలువురు అభిప్రాయపడుతున్నారు!