Home సినిమా రామ్‌ గోపాల్‌ వర్మ ‘వైరస్‌’ సినిమా

రామ్‌ గోపాల్‌ వర్మ ‘వైరస్‌’ సినిమా

SHARE

ఆఫీసర్‌ సినిమాతో మరో షాక్‌ ఇచ్చిన రామ్‌ గోపాల్‌ వర్మ మరో సినిమాను ప్రకటించాడు. గతంలో వర్మ దర్శకత్వంలో సర్కార్‌, ఎటాక్‌ ఆఫ్ 26/11 చిత్రాలను తెరకెక్కించిన పరాగ్‌ సంఘ్వీ కొత్త సినిమాను నిర్మించనున్నాడు. ఈ విషయాన్ని వర్మ సోషల్‌ మీడియా ద్వారా స్వయంగా ప్రకటించారు. వైరస్‌ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

నిర్మాతతో పాటు వర్మ కూడా ‘వైరస్‌’ సంబంధించిన ప్రెస్‌నోట్‌ రిలీజ్ చేశారు. సెంట్రల్‌ ఆఫ్రికాకు వెళ్లిన ఓ విద్యార్థి అరుదైన వైరస్‌ బారిన పడటం.. తరువాత ఆ విద్యార్ధి భారత్‌ తిరిగి వచ్చిన తరువాత భారీగా జరిగిన ప్రాణనష్టం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. కేవలం టైటిల్‌, కాన్సెప్ట్‌ మాత్రమే రివీల్ చేసిన దర్శక నిర్మాతలు నటీనటుల వివరాలు సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయాలను మాత్రం వెల్లడించలేదు.

Posted by RGV on Sunday, June 10, 2018