Home సినిమా కాక పుట్టిస్తోన్న క్రిష్ పొగడ్తలు!

కాక పుట్టిస్తోన్న క్రిష్ పొగడ్తలు!

121
SHARE

జూన్ 10 నే బాలయ్య బాబు పుట్టినరోజు. ఈ రోజు పురస్కరించుకుని ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అంత వరకూ బ్రహ్మాండం. దర్శకుడు తేజ వదిలిపెట్టి వెళ్ళిపోయాక, క్రిష్ వచ్చి ఆ బాధ్యత నెత్తిన వేసుకున్నాడు. అందుకు బాలకృష్ణ నిజంగానే చాలా అదృష్టవంతుడిని చెప్పొచ్చు. కానీ క్రిష్ జాగర్లమూడి పొగడ్తల ట్వీట్ ఆశ్చర్యాయానికి గురిచేస్తుంది

తన నూరవ చిత్రంలో అమ్మ పేరుని ధరించి కూస్తంత మాతృఋణం తీర్చుకున్న “బసవ రామ తారక పుత్రుడు”,
ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృఋణాన్ని కూడా తీర్చుకుంటున్న “తారక రామ పుత్రుడు”,
శతాధిక చిత్ర “నటసింహం”,
నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు.
#HappyBirthdayNBK | #NTR |

కృతజ్ఞత ఉండాలి మోతాదు మించితే సగటు మనిషికి కూడా వెగటు పుడుతుంది. మరోపక్క క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ కి తారాగణం ఎంపిక చేయటంలో బిజీ బిజీ…! సంక్రాతికి రిలీజ్ చేయాలని బాలయ్య ప్లాన్. మరి క్రిష్ ఆ టైం కి రెడీ చేయగలడా??చూద్దాం!!