Home రాజకీయాలు జారుకున్న జలీల్ ఖాన్… ఏందీ రచ్చ?

జారుకున్న జలీల్ ఖాన్… ఏందీ రచ్చ?

SHARE

వైకాపా నుంచి గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి, అనైతికంగా సైకిల్ ఎక్కేసిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్… అనంతర కాలంలో “బీకాం లో ఫిజిక్స్” తో ఫుల్ పాపులర్ అయ్యారు. రాజకీయ నాయకుడిగా కంటే.. అత్యదికంగా పాపులర్ అయ్యింది మాత్రం ఆయన చదివిన బీకాం లో ఫిజిక్స్ సబ్జెక్టు తోనే! నాటి నుంచి మీడియా ఫోకస్ జలీల్ వ్యవహారాలపై ఫోకస్ చేసింది. మరో కళాకండం బయటకు ఏమొస్తుందా అని ఎదురుచూసింది! ఈ క్రమంలో పలు సంఅర్భాల్లో మీడియా మిత్రులకు నిరాశపరచలేదు జలీల్ ఖాన్! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా తగుదునమ్మా అంటూ ప్రోటోకాల్ పట్టించుకోకుండా చేసిన ఒక వ్యవహారంలో.. మహిళా కారొరేటర్ రియాక్షన్ తో జారుకున్నారు!

వివరాళ్లోకి వెల్తే… విజయవాడలోని నైజాం గేట్‌ సెంటర్‌ లో రోడ్ల విస్తరణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌ హాజరయ్యారు. ప్రారంభోత్సవ శిలాఫలకం వద్ద కార్పొరేటర్‌ ప్రమేయం లేకుండానే.. తెలుగుదేశం పార్టీ నేతలతో ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొట్టించేశారు. దీంతో ప్రొటోకాల్‌ను పట్టించుకోకుండా టీడీపీ నాయకులతో ఎలా కొబ్బరికాయ కొట్టిస్తారని ఎమ్మెల్యేను వైఎస్సార్‌ సీపీ కార్పొరేటర్‌ జాన్‌ బీ నిలదీశారు. తాను వైకాపా కార్పొరేటర్ అయినంతమాత్రాన్న ప్రోటోకాల్ పాటించరా అంటూ ప్రశ్నించారు. అక్కడికే చేసినది పనికిమాలిన పని అని గ్రహించని జల్లీల్ ఖాన్.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మహిళా కార్పొరేటర్‌ జాన్‌ బీపై దిగారు.

అక్కడితో ఆగకుండా… ఈ డివిజన్‌ లో నువ్వు పని చేయొద్దు అంటూ అవగాహనారాహిత్యంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఒక డివిజన్‌ లో ప్రజలు ఎన్నుకున్న కార్పొరేటర్‌ను పని చేయొద్దని అని ఆదేశించే అర్హత జలీల్ కు ఉంటుందా ఉండదా అన్న ఇంగితం కూడా మరిచిన ఆయనను… కార్పొరేటర్ నిలదీశారు. అయినా కూడా తగ్గని జలీ… ఆగ్రహంతో ఆ మహిళా కార్పొరేటర్ పైకి దూసుకొస్తూ… కాళ్లు పట్టుకుని సీటు తెచ్చుకున్నావ్‌ అని జాన్‌ బీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేనే ఇలా చెలరేగిపోతుంటే.. తాము మాత్రం ఎందుకు తగ్గాలనుకున్నారో ఏమో… టీడీపీ కార్యకర్తలు సైతం మహిళా కార్పొరేటర్‌ పై విమర్శలకు దిగారు.

అనంతరం ఫైరయిన జాన్ బీ… మహిళలన్న కనీస గౌరవం కూడా లేకుండా మాట్లాడతారా? ప్రజల కోసం పని చేయొద్దని చెప్పడానికి ఎమ్మెల్యే ఎవరు? అని గట్టిగా నిలదీయడంతో… కార్పొరేటర్‌ రియాక్షన్‌ కి దిమ్మతిరిగి బొమ్మ కనబడింతో ఏమో కానీ.. అవాక్కైన జలీల్‌ ఖాన్‌ అక్కడి నుంచి జారుకున్నారు. ఇలాంటి పనులు రాష్ట్రం మొత్తం మీద జరుగుతున్నాయని, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అడ్డూ అదుపూలేకుండా పోతుందని ఈ సందర్భంగా పలువురు వ్యాఖ్యానించారు!!