Home సినిమా మధురమైన సమయం : శ్రీనివాసరెడ్డి

మధురమైన సమయం : శ్రీనివాసరెడ్డి

SHARE

ఎన్టీఆర్‌ సినిమాలో తాను నటించడాన్ని మధురమైన సమయంగా ఫీల్‌ అవుతున్నారు శ్రీనివాసరెడ్డి. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా హారికా హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న సినిమా ‘అరవింద సమేత వీరరాఘవ’. ఈ సినిమాలో హాస్య నటుడిగా శ్రీనివాసరెడ్డి నటిస్తున్నారు. ఈ చిత్రం లొకేషన్‌లో ఎన్టీఆర్, త్రివిక్రమ్‌లతో కలిసి దిగిన ఫొటోను శ్రీనివాసరెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘మధురం మధురం ఈ సమయం’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. సో.. ఎన్టీఆర్‌కు, శ్రీనివాసరెడ్డికి మధ్య ఏవో చిన్నపాటి మనస్పర్థలు ఉన్నాయన్న పుకార్లకు ఈ ఫొటో ఫుల్‌స్టాప్‌ పెట్టింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.