Home రాజకీయాలు బాబుకు నిద్రపట్టని మాటన్న వరదరాజులు!

బాబుకు నిద్రపట్టని మాటన్న వరదరాజులు!

97
SHARE

ఇప్పటికె ఏపీలో ఎన్నికల వాతావరణం దగ్గరైపోయినంతగా రాజకీయాలు వేడెక్కిపోతున్నాయి. ఈ క్రమంలో అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం వైకాపా, జనసేన పార్టీలు ఏకదాటికి చంద్రబాబు పాలన వైఫల్యాలను, అవినీతిని ఎండగడుత్న్నాయి. అదే క్రమంలో ప్రత్యేక హోదా రాష్ట్రానికి రాకపోవడానికి చంరబాబు వైఖరే కారణం అనే విషయం ఇప్పటికే జనాల్లోకి వెళ్లిపోయింది. దీంతో తాను రాష్ట్రానికి చాలా చేశానని, ఏమైనా చేయకపోతే అది బీజేపీ తప్పని.. ప్రభుత్వ ఖజానాతో నవ నిరంఆణ దీక్ష పేరిట ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేశారు. ఈ సమస్యలన్నీ చాలవన్నట్లు… టీడీపీలో రోజు రోజుకీ బయటపడుతున్న వర్గ విభేదాలు బాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయని అంటున్నారు.

ఇప్పటికే అఖిల ప్రియ – సుబ్బారెడ్డిల వ్యవహారంతో అక్కడ ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి… గంటా శ్రీనివాసరావు – అయ్యన్న పాత్రుడి వ్యవహారం మరోపక్క.. ఆదినారాయణ రెడ్డి – రామసుబ్బారెడ్డి వ్యవహారం ఇంకోపక్క.. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే! ఇలాంటి వర్గ విభేదాలు టీడీపీలో రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలో అవి చాలవన్నట్లు తాజాగా ఎంపీ సీఎం రమేష్ పై ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి చేసిన విమర్శలు.. టీడీపీలో వర్గ విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయో చెప్పకనే చెబుతున్నాయి.

తాజాగా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి.. ఎంపీ సీఎం రమేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆగ్రహంలో భాగంగా సీఎం రమేష్‌ పై ఎవరూ ఊహించని రీతిలో విమర్శలు చేశారు. సీఎం రమేష్ పంచాయతీ ఎన్నికలకు ఎక్కువ, మండల ఎన్నికలకు తక్కువని ఎద్దేవా చేసిన వరదరాజులు.. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచే సత్తాలేని రమేష్‌.. గ్రూప్‌ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ప్రతిపక్షాల కంటే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రమేష్ ప్రవర్తన వల్ల టీడీపీ గెలిచే స్థానాలు కూడా ఓడిపోయేలా సర్వనాశనం చేస్తున్నారని విమర్శించారు. ఇదే క్రమంలో కుందూ-పెన్నా వరద కాలువ పనుల్లో ఐదుశాతం మామూళ్లు ఇవ్వాలని ఎంపీ రమేష్‌ డిమాండ్‌ చేస్తున్నారని వరదరాజులురెడ్డి తీవ్రంగా ఆరోపించారు.

ఆ ఆరోపణలన్నీ ఒకెత్తు అయితే… అనంతరం చేసిన ఒక ఆరోపణ మాత్రం కాస్త ఆక్షేపణీయంగా ఉన్నప్పటికీ, అసలే తన నీడను సైతం పూర్తిగా నమ్మరనే పేరుంది అని చెప్పుకునే చంద్రబాబుకు నిద్రపట్టని మాటన్నారు వరదరాజులురెడ్డి. అదేమిటంటే… వైసీపీకి సీఎం రమేష్‌ కు మాంచి సంబందాలున్నాయని, వైకాపాకు రమేష్ ఒక మద్దతుదారుడని. అక్కడితో ఆగారా అంటే… జగన్‌ తో సీఎం రమేష్‌ నిత్యం టచ్‌ లో ఉంటుంటారని కామెంట్ చేశారు. బాబుకు ఉన్న అత్యంత దగ్గర కోటరీలో సీఎం రమేష్ ఒకరు. అలాంటి రమేష్ పైనే వరదరాజులు ఇలాంటి కామెంట్స్ చేసే సరికి.. టీడీపీలో వర్గ విభేదాలు ఏ రేంజ్ లో ఉన్నాయనే విషయం మొత్తం సైడ్ కి వెళ్లిపోయి.. బాబు ప్రస్తుత మానసిక పరిస్థితి, ఆరోగ్యంపై ఆందోళన చెందుతున్నారట తమ్ముళ్లు!!