Home రాజకీయాలు లోకేష్ కు “ముద్దు పేరు” ఊరికినే రాలేదు!

లోకేష్ కు “ముద్దు పేరు” ఊరికినే రాలేదు!

SHARE

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి నారా లోకేష్ పై మరోమారు సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఎంత సీరియస్ విషయంపై అయినా సోషల్ మీడియాలో మాత్రమే స్పందించడానికి ఆసక్తిని చూపించే లోకేష్ కు… ఆ సోషల్ మీడియాలో సెటైర్ల వర్షాలు పడుతుండటం విశేషం. సమకాలీన రాజకీయాలపైనా, ప్రజాసమస్యలపైనా, విషయ అవగాహనపైనా లోకేష్ కు పరిపూర్ణమైన అజ్ఞానం, అవగాహనా రాహిత్యం ఉందని కామెంట్స్ వినిపిస్తున్న తరుణంలో… ఇప్పటికే నెటిజన్లంతా ఆయన చేస్తున్న పనులకు ఒక “ముద్దు పేరు” పెట్టుకుని పిలుచుకుంటున్న పరిస్థితుల్లో.. అది తనకు “సరైన పేరే” అని నిరూపించుకునే ప్రయత్నాలు మాత్రం మానడం లేదు!

ఈ రాష్ట్రంలో అవినీతిమయమైన పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ అని పలికిన లోకేష్.. జయంతికీ వర్ధంతికీ తేడా తెలియని లోకేష్.. తన పరిపూర్ణమైన అవగాహన రాహిత్యం వల్లో లేక అత్యుత్సాహం వల్లో కానీ ఆయన చేసే పనులు కామెడీకి మారుపేరుగా అయ్యాయని కామెంట్స్ పడుతున్నాయి. ఈ క్రమంలో గత వైభవం చాలదన్నట్లుగా మరో కొత్త పనికి పూనుకుని కార్టున్ సెటైర్లకు అవకాశం ఇచ్చారు నారా లోకేష్. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని టార్గెట్ చేసేందుకు ఆయన చేసిన ఒక పని ఇలా హాస్యాస్పదం కావడానికి కారణమవడం గమనార్హం.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం గతనాలుగేళ్లుగా అలుపెరగకుండా వైసీపీ ఉద్యమిస్తున్న సంగతి తెలిసిందే. నాడు వైకాపా చేస్తున్న హోదా పోరును ఎగతాళి చేసిన చంద్రబాబు అండ్ కో… ఇప్పుడు అన్నివర్గాల ప్రజలు ఉద్యమిస్తున్న నేపథ్యంలో తనకు డ్యామేజ్ అవుతుందని గ్రహించి అదే నినాదాన్ని ఎత్తుకుని వేదికలపై మైకుల ముందు ఊదరగొడుతున్నారు. ఈ క్రమంలో రొటీన్ కి భిన్నంగా ఆలోచించిన టీడీపీ యువనేత, మంత్రి లోకేష్ ప్రధానమంత్రికి ఓ పోస్ట్ కార్డ్ రాశారు. అయితే ఈ ఉత్తరంతోనే లోకేష్ బుక్ అయ్యారని అంటున్నారు నెటిజన్లు.

సరిగ్గా గమనిస్తే… ఈ పోస్ట్ కార్డుపై తన అడ్రస్ రాసే క్రమంలో సెక్రటేరియట్ స్పెల్లింగ్ ను తప్పుగా రాశారు. “Secretariat” అనేది సెక్రటేరియట్ కు కరెక్ట్ స్పెల్లింగ్ కాగా లోకేష్ బాబు మాత్రం “secreteriat” అని రాశాడు. విదేశాల్లో చదువుకున్న లోకేష్ ఇంగ్లిష్ పరిజ్ఞానం ఇదా అనే విషయం కాసేపు పక్కన పెడితే… ఇక ఏపీ రాజధాని అమరావతి స్పెల్లింగ్ సైతం తప్పుగా రాశారు. అమరావతిని ఆంగ్లంలో రాసినప్పుడు “H” ఉండదు. అయితే లోకేష్ దాన్ని కూడా కలిపేశారు! దీంతో మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సెక్రటేరియట్ స్పెల్లింగ్ తప్పుగా రాయడం ఒకెత్తు అయితే… రాజధాని పేరును సైతం సరిగా రాయలేకపోయాడంతో… లోకేష్ కు “ముద్దు పేరు” ఊరికినే రాలేదు, ఇలాంటి కష్టాలు ఎన్నో పడితేనే వచ్చిందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.