Home రాజకీయాలు లక్ష్మీనారాయణ రె”డీ” అవుతున్నారంట!

లక్ష్మీనారాయణ రె”డీ” అవుతున్నారంట!

79
SHARE

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారనేది దాదాపుగా ఫిక్సయిపోయిన విషయం! ఈ క్రమంలో రాజకీయాల్లోకి వచ్చే ముందు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాలాని, క్షేత్రస్థాయి పర్యటనలు అధ్యయనాల వల్ల సమస్యలపై అవగాహన రావడంతో పాటు వాస్తవాలు తెలుసుకునే అవకాశం ఉంటుందని భావించారు లక్ష్మీనారాయణ. ఆ కారణంగా రాజకీయాల్లోకి వచ్చేముందు ఏపీ సమస్యలపై అవగాహన పెంచుకునే క్రమంలో ఇప్పటివరకూ ఐదుజిల్లాలో పర్యటించారు! తాజాగా ఆ విషయాలను వెల్లడించిన ఆయన… బాబుతో దాదాపుగా విభేదించారు!

స్థానిక సమస్యలపై అవగాహన పెంచుకునే క్రమంలో ఇప్పటివరకూ ఐదు జిల్లాల్లో పర్యటించాననని చెబుతున్న లక్ష్మీనారాయణ… ఈ పర్యటన కారణంగా చంద్రబాబు సర్కారు పాలన ఎలా సాగుతున్నదో తెలుసుకునే అవకాశం కలిగిందని చెబుతున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు చెప్పుకొతున్న కబుర్లు, అంతా బ్రహ్మాండంగా ఉందంటూ చెబుతున్న మాటలకు, చేసుకుంటున్న ప్రచారాలకు, క్షేత్రస్థాయిలో పరిస్థితికి తేడా ఉందని అంటున్నారు!

ఏ వేదికెక్కినా రాష్ట్రంలో అవినీతి లేనేలేదని చంద్రబాబు చెబుతుండగా, అదే సమయంలో రాష్ట్రంలో అవినీతి ఎక్కువగా ఉందని లక్ష్మీనారాయణ చెబుతున్నారు. పథకాల అమల్లో అవినీతి బాగా కనబడుతోందని.. బెల్టు షాపుల కారణంగా కుటుంబాలు నాశనమైపోతున్నాయని.. పంటలకు గిట్టుబాటు ధరలు లేవని వెల్లడించారు. అయితే… ఈ విమర్శలను రాజకీయ కోణంలో, రాజకీయ ప్రత్యర్ధులు చేసిన విమర్శలుగా భావించాల్సిన అవసరం లేదనేది పలువురి వాదనగా ఉంది!

నిన్నమొన్నటివరకూ టీడీపీ అండ్ వారి మీడియా… లక్ష్మీనారాయణను హీరో అని చెప్పిన సంగతులు తెలిసినవే. ఆయన చాలా నిజాయితీ పరుడని, నిజాలే చెబుతారని చెప్పుకొచ్చిన టీడీపీ నేతలు ఈ విషయాలపై ఎలా స్పందిస్తారు అనేది నేడు ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో ఒక మాజీ అధికారిగా స్పందించి సామాన్యుడి కోణంలో సమస్యలు చెబుతుంటే… బాబుకు మాత్రం జేడీపై తెగ కోపం వచ్చేస్తుంది. నిన్నమొన్నటివరకూ జగన్ – పవన్ లను మాత్రమే విమర్శించిన చంద్రబాబు… తాజాగా తన ప్రసంగాల్లో లక్ష్మీనారాయణపై కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో నిజాలు చెబితే ఎవరిపై అయినా బాబు విరుచుకుపడతారని స్పష్టం అయ్యింది.

ఈ క్రమంలో లక్ష్మీనారాయణ సొంత కుంపటి పెడతారా లేక రాజకీయ ఊహాగాణాల్లో భాగంగా అటు బీజేపీలో కాని, ఇటు జనసేనలో కానీ చేరతారా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ క్రమంలో వీలైనంత త్వరగా ఆయన ఏదైనా రాజకీయ పార్టీలో చేరి, అనంతరం ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉందని చెబుతున్నారు విశ్లేషకులు! అదే జరిగితే… లక్ష్మీనారాయణ సాక్ష్యాలతో బాబుపై దాడికి రెడీ అయినట్లేనని అనుకోవచ్చు!!