Home రాజకీయాలు బాబు బెదిరింపు: కుక్కలు చింపిన విస్తరి!

బాబు బెదిరింపు: కుక్కలు చింపిన విస్తరి!

SHARE

తనకు మరోమారు అధికారం ఇస్తే.. రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను.. ముందుకు తీసుకుపోతాను.. అని చెప్పుకోవాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు బెదిరింపు పనులకు తెగబడుతున్నారు. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగిన నవ నిర్మాణ దీక్ష మహాసంకల్ప సభలో ప్రసంగించిన చంద్రబాబు… రాబోయే ఎన్నికల్లో తనకున్న కోరికల చిట్టా విప్పారు. 2019 ఎన్నికల్లో బీజేపీ, వైసీపీలను ఓడించాలి. దీంతోపాటు… రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేలా కేంద్రంలో ప్రధానిని నిర్ణయించే విధంగా 25 ఎంపీ స్థానాల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలి అని ప్రజలను కోరుతున్న చంద్రబాబు… ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలి. అది జరగాలంటే 2019 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ గెలవాలి. అని చెప్పుకొచ్చారు. అంతవరకూ చేసిన రాజకీయ ప్రసంగం ఒకెత్తు అయితే.. అనంతరం బాబు బెదిరింపులపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి!!

తనకు సైతం మనసులో ఎక్కడో, ఏమూలో జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయం ఉన్నట్లుగా స్పందించిన చంద్రబాబు… “2019 ఎన్నికల్లో తెలుగుదేశం మళ్లీ గెలవాలి.. అలా కాకుండా జరగరానిది జరిగితే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది” అని జనాలను బెదిరించే కార్యక్రమానికి తెరలేపారు. తానుతప్ప ఇంకెవరు ముఖ్యమంత్రి అయినా… రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది అనడంపై సర్వత్రా విమర్శలు వెళ్లివెత్తుతున్నాయి. ఇది బాబుకు రాష్ట్రంపై ఉన్న ప్రేమ కాదు.. 2014నుంచి నేటి వరకూ జరిగిన వ్యవహారాలాపై 2019లో వచ్చే కొత్త ప్రభుత్వం అమరావతి గుట్టు బయటపెడుతుందనేది అని ఒక వాదన! మరో విషయం ఏమిటంటే… 2014నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో చంద్రబాబు పాలన నిజంగా “కుక్కలు చింపిన విస్తరి” లా తయారయ్యిందనేది!!

ఏ పనికీ ఒక పద్దతి లేదు.. జనాలకు చూపించే బొమ్మలకు జరుగుతున్న వాస్తవాలకు ఏమాత్రం సంబందం లేదు.. అవినీతి విజృంభించిన వైనం.. అమరావతి మొత్తం అల్లకల్లోలం.. అమారావతి పేరున ఏమి జరుగుతుంది అనే విషయంపై జనాలకు ఇప్పటివరకూ క్లారిటీ ఇచ్చింది లేదు.. రాజధానికి భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి ఏమిటనేది ఎవరికీ తెలియని విషయం.. కేంద్రం పూర్తిచేయాల్సిన పోలవరాన్ని తగుదునమ్మా అంటూ తీసుకుని అటూ ఇటూ కాకుండా చేస్తున్న పరిస్తితి.. రైతు రుణమాఫీ అని చెప్పి రైతులను, డ్వాక్రా రుణాల మాఫీ అని మహిళలను, నిరుద్యోగ భృతి అని యువకులను అడ్డంగా మోసం చేసిన వైనం.. ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల గురించి ఆలోచించని పరిస్థితి.. మహిళలలపై దాడులు, రాజకీయ హత్యలు.. అత్యాచారాలు.. నాలుగు సీసీ రోడ్లేసి రాష్ట్రం అభివృద్ది చెంది దూసుకుపోతుందని చెబుతున్న కళ్లబొల్లి మాటలు.. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి నుంచే కుల మత విధ్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు.. రాజ్యాంగాన్ని అవహేళన చేసేలా అసెంబ్లీలో వ్యవహారాలు.. నిస్సిగ్గుగా అనైతికంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం.. ఇవన్నీ చూసిన తర్వాత కుక్కలు చింపిన విస్తరిలా రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఉందనడానికి ఇంతకు మించి ఉదాహరణ ఏమి ఉంటుంది? ఇదే విషయాన్ని చంద్రబాబును అడుగుతున్నారు ప్రజలు!!

ఇప్పటికే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరిలా తయారయ్యింది.. అలా చేసే అవకాశం మరొకరికి లేదు.. తమ పాలనలో రాష్ట్ర పరిస్థితి ఇదేకదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. అనుభవం అనుభవం అని చెప్పి బాబు చేసిన పని ఇది అని బాబు పాలనపై ప్రజలు పెదవి విరుస్తున్నారు!! ఈ విషయాలను గ్రహించని చంద్రబాబు… తాను మాత్రమే.. అనే అహంకార పూరిత ధోరణిని వీడటం లేదు!!