Home రాజకీయాలు 30వ సారి.. బాబు సమర్ధత తేలిపోనుంది!

30వ సారి.. బాబు సమర్ధత తేలిపోనుంది!

SHARE

ఏపీకి కేంద్రం ఏమీ సాయం చేయలేదనేది బాబు ఫైనల్ గా చెబుతున్న మాట! గత నాలుగేళ్లుగా ఏమిచేశారయ్యా ముఖ్యమంత్రిగారూ అని అడిగిన వారికి బాబు ఇచ్చే సమాధానం… వెయిట్ చేశానని! ఇప్పుడు మోసపోయానని! రాష్ట్ర ప్రయోజనాలకోసం 29సార్లు ఢిల్లీ వెళ్లి వచ్చామని! ఈ క్రమంలో బాబు ఇంతకాలం చెప్పుకొచ్చిన ఈ 29సార్లు ఢిల్లీ యాత్ర ఒకెత్తు అయితే… త్వరలో వెళ్లబోయే 30వ సారి పర్యటన అత్యంత కీలకం కాబోతుంది. ఈ క్రమంలో బాబు సామర్ధ్యం, సమర్ధత, ఎవరికీ భయపడేది లేదు అనే స్టేట్ మెంట్స్, కేంద్రంలో తనకు చాలా పలుకుబడి ఉందనే మాటల్లో వాస్తవాలు తెలిసిపోనున్నాయి!!

ఇంతకాలం స్నేహితులుగా, మిత్రపక్షాలుగా ఉండగా 29సార్లు వెళ్లినా పనులు అవ్వలేదని తన అసమర్ధతను, చేతకాని తనాన్ని కేంద్రప్రభుత్వ మోసంగా ప్రచారం చేసుకుంటున్న చంద్రబాబు… ఈ నెల 16వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్‌ సాధారణ మండలి సమావేశం కారణంగా ఢిల్లీ వెళ్లబోతున్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో తెగతెంపులు చేసుకున్న అనంతరం చంద్రబాబు.. చాలాకాలం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి ఓ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ మండలిలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా ఉంటారు. ప్రధాని ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో పాలుపంచుకోవాలని చంద్రబాబు కూడా ఇప్పటికే నిర్ణయించారు. దీంతో మోడీతో బాబు ఏమి మాట్లాడతారు… ఏపీలో ప్రతీ వేదికమీద మైకుల్లో ఊదరగడొతున్న సాహసోపేత మాటలు, మోడీని ఎండగడుతున్న విమర్శలు.. మోడీ ఎదురవగానే ఏమవుతాయి అనేది చర్చనీయాంశంగా మారింది.

అయితే.. ఈ సమావేశంలో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలో.. ఏపీకి జరిగిన అన్యాయం, మోడీ మోసం చేశారని చెబుతున్న మోసం తాలూకు విషయాలు గురించి మోడీని అగాల్సినవి అడిగేసే అవకాశం చంద్రబాబుకు వచ్చింది. తాను ఎవరికీ భయపడేది లేదు అని చెప్పుకునే చంద్రబాబు.. ఢిల్లీలో మోడీ ఎదురవగానే ఈ విషయాలు, ఆయన ఏపీకి చేసిన మోసంపై ప్రశ్నిస్తారా లేదా అనేవిషయం ఆసక్తికరంగా మారింది. ఈ విషయాలపై బాబు ఏమాత్రం తగ్గరని, మోడీకి దేశంలోని అందరి ముఖ్యమంత్రుల ముందు నిలదీసి ప్రశ్నిస్తారా లేక.. అన్నింటికీ లోపల తలౌఉపి, మౌనంగా కూర్చుని.. బయటకొచ్చి కడిగేశానని చెబుతారా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా.. 30సారి ఫైనల్ గా బాబు సమర్ధత తేలిపోనుందనేది మాత్రం కచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం!