Home సినిమా అల్లరి నరేష్, సునీల్ మూవీ ‘సిల్లీ ఫెల్లోస్’ ఫస్ట్ లుక్

అల్లరి నరేష్, సునీల్ మూవీ ‘సిల్లీ ఫెల్లోస్’ ఫస్ట్ లుక్

SHARE

టాలీవుడ్ కామెడీ స్టార్స్ హీరో అల్లరి నరేష్, సునీల్ కాంబినేషన్లో మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ‘సిల్లీ ఫెల్లోస్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ఫస్ట్ లుక్ శుక్రవారం విడుదల చేశారు. భీమినేని శ్రీనివాస రావు దర్శకత్వంలో పూర్తి వినోదాత్మక చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాకు టైటిల్‌పై కొద్ది రోజులగా చర్చ జరుగుతోంది.

చాలా టైటిల్స్‌ను పరిశీలించిన తరువాత ఫైనల్‌గా ‘సిల్లీ ఫెలోస్‌’ టైటిల్‌కు ఫిక్స్‌ అయ్యారు చిత్రయూనిట్‌. ఇద్దరు టాప్ కామెడీ స్టార్‌లు కలిసి నటిస్తుండటంతో సినిమాలో వినోదానికి డోకా లేదని తెలుస్తోంది. ఇద్దరు హీరోలతో పాటు దర్శకుడు భీమినేని కెరీర్‌కు కూడా ఈ సినిమా విజయం ఎంతో కీలకం. బ్లూ ప్లానెట్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో పూర్ణ, చిత్ర శుక్లాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.