Home రాజకీయాలు నిస్సుగ్గు వ్యాఖ్య: జగన్ అన్యమతస్తుడంట..!

నిస్సుగ్గు వ్యాఖ్య: జగన్ అన్యమతస్తుడంట..!

SHARE

రాజకీయా నాయకులు మాట్లాడుతున్నారంటే.. వారి మాటలకు, విమర్శలకు ఏమాత్రం విలువ లేకుండా పోతున్న రోజులివి! ఆ విమర్శల్లో వాస్తవాలు, అవాస్తవాల సంగతి కాసేపు పక్కన పెడితే.. కనీస విలువలు లేని విమర్శలు నేటి రాజకీయాల్లో పెట్రేగిపోతున్నాయి. రాజకీయ నాయకులకంటే తామేమైనా తక్కువ తిన్నామా అంటూ చెలరేగిపోతున్నారు ఇతర సంఘాల నాయకులు! రాజకీయాలు వద్దంటూనే రాజకీయ విమర్శలు, రాజకీయ ఉపన్యాశాలు చేసేస్తున్నారు. ఈ క్రమంలో నిస్సిగ్గు వ్యాఖ్యలు, అర్ధరహిత వాదనలకు తెరలేపుతున్నారు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య.

ఈ సందర్భంగా స్పందించిన ఆనంద్ సూర్య… రాష్ట్రంలో అశాంతిని నెలకొల్పడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని మొదలుపెట్టి.. బీజేపీ – వైకాపా డైరెక్షన్ లో రమణ దీక్షితులు నడుస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ రాజకీయ విమర్శల సంగతి కాసేపు పక్కన పెడితే… అన్యమతస్థుడైన వైఎస్ జగన్ ను రమణ దీక్షితులు ఎలా కలుస్తారు అంటూ సభ్యసమాజం “ఛీ” అనే మాటలు మాట్లాడారు. ఈ రాష్ట్రంలో ఉన్న హిందువులను, బ్రాహ్మణులను, అర్చకులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ… వారి మనోభావాలు కించపరిచేలా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఇక్కడ ఆనంద్ సూర్య గమనించాల్సింది ఒకటుంది. వైకాపా అధినేత జగన్.. క్రైస్తవులా, హిందువులా, ముస్లింలా అన్నది కాదు ముఖ్యం. ఆయన ఒక ప్రజానాయకుడు, ప్రజల మద్దతుతో ఎన్నికైన ప్రతిపక్ష నేత! ఆనంద్ సూర్య చెబుతున్న జగన్ కు ఓట్లేసి గెలిపించిన వారిలో క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, బ్రాహ్మణులు అనే తేడాలు ఉన్నాయా? అందరూ ఓట్లేస్తేనే కదా ఆ హోదా దక్కింది! జగన్ ఏమీ నామినేటెడ్ పోస్టుల్లో కూర్చున్న మనిషి కాదు కదా… ప్రజా మద్దతుతో రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి. అలాంటి ప్రజానాయకుడిని పార్టీ కోణంలోనో, రాజకీయ ప్రత్యర్ధి కోణంలోనో విమర్శిస్తే అర్ధం చేసుకోవచ్చు కానీ… రమణ దీక్షితులు ఒక బ్రాహ్మణుడిగా, ఒక హిందువుగా.. క్రైస్తవుడైన జగన్ ను కలవడంపై ఖండిస్తున్నామనడం నిస్సిగ్గు వ్యాఖ్య కాకమరేమిటి?

ఈ దౌర్భాగ్యకరమైన విమర్శలు, కుల మత పోకడలు పోకుండా చూస్తూ, తమ పబ్బం గడుపుకునే కొంతమంది వ్యక్తులు ఇంకా ఇలా ఉండబట్టే కదా… ఈ దేశాభివృద్ధిని ఈ కుల మత పిశాచాలు వెనక్కి లాగుతున్నాయి. ఆ విజ్ఞత మరిచిన ఆనంద సూర్య… అన్యమతం, హిందూ మతం అంటూ అసభ్యకర రాజకీయ విమర్శలను చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లివెత్తుతున్నాయి! ఆయన చెప్పిన మాటలను పరిగణలోకి తీసుకుంటే… ఏ క్రైస్తవుడికైనా, ఏ ముస్లింకైనా సమస్య వస్తే ముఖ్యమంత్రి హోదాలో ఉన్న హిందూ మతానికి చెందిన చంద్రబాబును కలవకూడదా.. కలిసి సమస్యలు చెప్పుకోకూడదా.. అలా కలిసినంతమాత్రాన్న క్రైస్తవుల, ముస్లింల మనోబావాలు కించపరిచినట్లేనా? సిగ్గు సిగ్గు ఆనంద సూర్య మాటలు!!

కాగా… టీటీడీ పవిత్రతను కాపాడటమే తన ప్రయత్నమని మొర్రపెట్టుకుంటున్న రమణ దీక్షితులు… తిరుమలలో జరుగుతున్న అవకతవకలపై ఎన్నిమార్లు అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లినా పట్టించుకోలేదని, కొండపై ఉన్న అధికారులు ఇస్తున్న తప్పుడు సమాచారాన్ని సీఎం నమ్ముతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లేందుకు యత్నించానని చెబుతున్న ఆయన, అందుకు బాబు నుంచి అనుమతి రాలేదని.. ఆ క్రమంలోనే ప్రతిపక్ష నేత జగన్ ను కలిశానని చెబుతున్న సంగతి తెలిసిందే.