Home రాజకీయాలు మోడీ హత్యకు కుట్ర లేఖ

మోడీ హత్యకు కుట్ర లేఖ

SHARE

ప్రధాని నరేంద్ర మోడీ ని హత్య చేయడానికి ప్లాన్ జరుగుతోందని నక్సల్స్ వద్ద దొరికిన లేఖలో ప్రస్తావించబడినట్టు తెలిసింది. రాజీవ్ హత్య జరిగినట్లుగా మోడీని హత్య చేసే అవకాశంపై ఆ లేఖలో పేర్కొనడం జరిగింది.

అయితే ప్రదాని మోడీ ని హత్య చేయడానికి కుట్ర జరిగిందన్న వార్తలపై కాంగ్రెస్ పార్టీ సందేహం వ్యక్తం చేసింది. భాజపా కి మోడీకి ప్రజలలో ఆదరణ తగ్గుతోందని అది ఆపటానికి, ప్రజల్లో ఓ సి౦పతీ కలగటానికి ఇదో కొత్త వ్యూహం అమలు చేస్తున్నారా అన్న అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు.

గతంలో మోడీ ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఇటువంటి ఫీలర్లు వదలేవారని కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్ వ్యాఖ్యానించారు. ఆయనకు ఆదరణ తగ్గుతు౦ది అని అనుమానం వచ్చినప్పుడల్లా ఇలాంటి లేఖలు వచ్చేవని సంజయ్ వ్యాఖ్యానించారు. అయితే ఈ లేఖల్లో వాస్తవం ఎంతో తెలియాల్సి ఉందని దానిపై దర్యాప్తు జరగాలని కాంగ్రెస్ పార్టీ కూడా కోరుకుంటోందని ఆయన అన్నారు.ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నినట్లు పుణె పోలీసులు వెల్లడించారు.