Home రాజకీయాలు “ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా పవన్ నేర్చుకోవాలి కదా..?”

“ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా పవన్ నేర్చుకోవాలి కదా..?”

SHARE

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై టాలీవుడ్ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ రాజకీయ ప్రయాణం జన సేన పార్టీల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కోట, ప్రజారాజ్యం అనుభవాల నుంచైనా పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలి కదా, వాళ్ల అన్నకు ఏం జరిగిందో అర్థం చేసుకోవాలిగా అని అన్నారు.

‘మనకెందుకు చెప్పండి…..నేనే రాజకీయాల నుంచి వెనక్కి వచ్చేశా…..పిచ్చోడినై వచ్చానా….సినిమా వాళ్లకు ఆ వాతావరణం పడదు….అన్నారు కోట. ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ఆయన ప్రస్తావించారు. రాజకీయాల్లోకి రావటమా వద్దా అనే విషయమై రజనీ లాంటి పెద్ద స్టార్లే అంతలా
తర్జన భర్జన పడుతున్నప్పుడు కుర్రాడు అయిన పవన్ అర్థం చేసుకోవాలిగా….అంటూ కోట చెప్పుకొచ్చారు. ఇంతకీ పవన్ రాజకీయాల్లో సక్సెస్ కాలేదని కోట అభిప్రాయమా లేక పవన్రా జకీయాలు చేయలేడని కోట అభిప్రాయమా??