Home రాజకీయాలు కాంగ్రెస్ పై బాబు వన్ సైడ్ లవ్!

కాంగ్రెస్ పై బాబు వన్ సైడ్ లవ్!

SHARE

2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీని ఏకిపారేసిన చంద్రబాబు.. మోడీ ప్రధాని అయితే మామూలుగా ఉండదని చెబుతూ బీజేపీతో జతకట్టిన సంగతి తెలిసిందే. దీంతో బాబు బలహీనతలు గుర్తించిన బీజేపీ పెద్దలు.. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి అత్యధిక సీట్లు కావాలని డిమాండ్ చేశారట. దీంతో ఏపీలో బీజేపీ ఏకిమేకై కూర్చుంటుందనే భయంతో.. బీజేపీకి “ప్రత్యేక హోదా” సాకు చూపిస్తూ రాం రాం చెప్పేశారు! నాటి నుంచి సెంట్రల్ పార్టీల స్నేహం కోసం ఆశగా ఎదురుచూస్తున్న బాబుకు.. మరేపార్టీ కనిపించడం లేదు. సరే.. తృతీయ ఫ్రంట్ లాంటిదేమైనా ప్లాన్ చేద్దాం అనుకునేలోపు కేసీఆర్ రంగంలోకి దిగారు. దీంతో బాబుకు కాంగ్రెస్ పార్టీ తప్ప మరో దిక్కు కనిపించడం లేదు!!

అయితే.. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో బాబుది కాంగ్రెస్ పై వన్ సైడ్ లవ్ అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ లో టీడీపీని మెర్జ్ చేస్తే సరే కానీ.. టీడీపీతో జతకట్టే ఎన్నికల పొత్తులపై మాత్రం ఆసక్తిగా లేరని తెలుస్తుంది. ఈ విషయంలో చంద్రబాబు అంటే.. కాంగ్రెస్ ని విమర్శించడం మానేశారు కానీ, కాంగ్రెస్ నేతలు మాత్రం బాబు పాలనపై ఫైరవుతున్నారు. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ చార్జ్‌ గా కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్‌ చాందీ నియమితులైన అనంతరం మరింత వాయిస్ పెంచుతున్న ఏపీ కాంగ్రెస్ నేతలు.. బాబు దీక్షలపైనా, అవినీతి పాలనపైనా ఫైరవుతున్నారు.

తాజాగా ఈ విషయాలపై స్పందించిన ఏపీ పీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి.. నవ నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం చేస్తున్నవన్నీ బూటకపు దీక్షలని విమర్శించారు. టీడీపీ నాలుగేళ్ల పాలనపై పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో శుక్రవారం ఒక చార్జిషీట్‌ విడుదల చేస్తామని.. పాలన మొత్తం అవినీతిమయం అయిపోయిందని తెలిపారు. సాగునీటి ప్రాజెక్టుల కోసం నాలుగేళ్లలో సీఎం చంద్రబాబు చేసిందేమి లేదని.. పోలవరం ప్రాజెక్టుపై ఎవరు ఏం చేశారో చర్చకు సిద్ధమా అంటూ చంద్రబాబుకు ఆయన ఇప్పటికే బహిరంగ లేఖ రాశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన కృషిపై బహిరంగ చర్చకు రావాలని ఈ సందర్భంగా చంద్రబాబుకు సవాల్‌ విసిరిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగని రగువీరా… చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు చెబుతూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం నేరంతో సమానమని పేర్కొన్నారు.

ఈ రేంజ్ లో కాంగ్రెస్ పార్టీ నేతలు చంద్రబాబుపై ఫైరవుతున్నా కూడా… బాబు మాత్రం బీజేపీని టార్గెట్ చేసిన దానిలో పది శాతం కూడా కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించే సాహసం చేయకపోవడం రాజకీయ వర్గాల్లో కాంగ్రెస్ పార్టీపై బాబు పెంచుకుంటున్న చన్ సైడ్ లవ్ పై చర్చలు నడుస్తున్నాయి.