Home రాజకీయాలు కార్యకర్త పై మరోసారి బాలయ్య జులుం

కార్యకర్త పై మరోసారి బాలయ్య జులుం

SHARE

సినీ నటుడు నటసింహం నందమూరి బాలకృష్ణ ఓ రాజకీయ నాయకుడు ప్రజలకి ప్రతినిధి కూడా. అలంటి మన హిందూపురం ఎమ్మెల్యే ఎక్కడ అనే సంకోచం లేకుండా ఫాన్స్ ని చెంప ఫాట్ ఫాట్ మనిపించడం లో బాలయ్య తరవాతే ఎవరైనా.

ఎమ్మెల్యే గా బాలయ్య చేసిన మంచి పనులు అభివృద్ధి పనులు పక్కన పెడితే చెంపదెబ్బల వార్తలలో ఎక్కువగా నిలిచారు. ఇక నియోజక అభివృద్ధి ఏమాత్రం జరగడం లేదనే వాదనలు వినిపిస్తూనే వస్తున్నాయి.

తాజాగా మరో ఘటన తో బాలయ్య సంగతి మరో మారు బయటపడింది. చిలమత్తూరు మండలం మరుసనపల్లి పంచాయతీ ఎస్‌. ముద్దిరెడ్డిపల్లి గ్రామంలో కనీస రోడ్డు లేదు. కాస్త వర్షానికే మట్టిరోడ్డు చిత్తడిమయం అవుతుందని బాలాజీ అనే ఓ కార్యకర్త ఫోటోలు తీసి బాలయ్యకు చూఫై రోడ్లు వెయ్యండి ఎంఎల్ఏ సారూ అని చెప్పడాని చూస్తే, ఈ విషయం సోషల్ మీడియా లో పెడతావా అంటూ బాలయ్య హాట్ హాట్ అయ్యాడట, పోలీసులతో బయటకు పంపించినట్లు బాధితుడు వాపోయాడు. బాలయ్య కి ఓటు వేస్తే చెంపదెబ్బ ఫ్రీ అనుకోండి సింపుల్ గా!