Home రాజకీయాలు రమణ దీక్షితులు వైఎస్ జగన్ ని ఎందుకు కలిశారు?

రమణ దీక్షితులు వైఎస్ జగన్ ని ఎందుకు కలిశారు?

65
SHARE

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు విపక్ష నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని హైదరాబాద్ లో కలిశారు. గురువారం రోజున హైదరాబాద్‌లో జగన్ ఇంటికి వెళ్లి రమణ దీక్షితులు విపక్ష నేత తో దాదాపుగా ౨౦ నిమిషాలు సమావేశం అయ్యారు. సమావేశం అనంతరం జగన్ స్వయంగా బయటకు వచ్చి రమణ దీక్షితులును సాగనంపారు. అనంతరం రమణ దీక్షితులు మీడియాతో ముచ్చటించారు.

జగన్ ను కలవడంపై స్పందిస్తూ కేవలం తన కష్టాలను చెప్పుకునేందుకే జగన్ ని కలిశానని అన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తమ కష్టాలను వినడం లేదని, అందుకని జగన్ ను కలవాలని వచ్చినట్టుగా ఆయన తెలిపారు. తమకు రాజకీయ పార్టీలతో పని లేదని వెంకటేశ్వర స్వామి వారికి సేవ చేసేందుకు అవకాశం లేకుండా చేసినందుకు న్యాయం కోసం జగన్ ని కలిసి తను చెప్పుకున్నట్టుగా తెలిపారు.

అయితే జగన్ తో రమణ దీక్షితులు సమావేశం రాజకీయ సంచలనంగా మారింది. ఇప్పటికే తెలుగుదేశం ప్రభుత్వంపై రమణ దీక్షితులు ఘాటు వ్యాఖ్యలు చేశారు; స్వామి వారి వజ్రం ఒకటి మాయమైందని, అలాగే తిరుమలలో నిక్షేపాల కోసం తవ్వకాలు కూడా జరిగాయని కూడా రమణ దీక్షితులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈయన జగన్ తో సమావేశం అయ్యారు. తను చేసి ఆరోపణలకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన స్పష్టం చేశారు.

ఈ వ్యవహారాలపై సీబీఐ విచారణ జరిపించాలని కూడా రమణ దీక్షితులు కోరుతున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాను ఇప్పటికే కలిశారీయన. ఇప్పటికైతే తెలుగుదేశం పార్టీ ఈయనపై విరుచుకుపడుతోంది.