Home రాజకీయాలు జగన్ పాదయాత్రలో తేనెటీగల బెడద – ఆగని ప్రజా సంకల్ప యాత్ర

జగన్ పాదయాత్రలో తేనెటీగల బెడద – ఆగని ప్రజా సంకల్ప యాత్ర

68
SHARE

ప్రతిపక్ష నేత వై ఎస్ జగన్ పాదయాత్ర ఈ రోజు చిన్న అపశృతి చోటుచేసుకుంది. యాత్ర చేస్తుండగా జనాలపై తేనేటీగల దాడి జరిగిందన్న సమాచారం వచ్చింది.

జగన్ వ్యక్తిగత భద్రతా సిబ్బంది జగన్కు కూడా తేనెటీగల ఇబ్బంది కాకుండా చూసారని సమాచారం. అయితే కేవలం ఓ అరగంట బ్రేక్ ఇచ్చిన జగన్ తిరిగి తన పాదయాత్రను యదావిధిగా కొనసాగించారు. ప్రజా సంకల్ప యాత్ర లో భాగంగా పెరవలి మండలం కానూరు శివారు కొండాలమ్మ గుడి వద్ద జగన్‌ పాదయాత్ర చేస్తుండగా గుడి భాగంలో తేనెటీగలు ఉన్నట్టు ఎవరు చూడలేదు. ఒక్కసారిగా తేనెటీగలు మూకుమ్మడి దాడి చేశాయి. తేనెటీగల దాడి నుంచి జగన్‌ను కాపాడేందుకు భద్రతా సిబ్బంది అన్ని ప్రయత్నాలు చేశారు. తేనెటీగలు పాదయాత్ర పొడవునా వందమీటర్లకు పైగా వచ్చి దాడిచేయటంతో వాటి నుంచి కాపాడుకోవటానికి యాత్రలో పాల్గొన్నవారు కూడా పాపం చాలా ఇబ్బంది పడ్డారు.

ఎవరో ఆకతాయి తేనెటీగల తుట్టె ని కదిలించడంతో అవి వచ్చి దాడిచేశాయని చెబుతున్నారు. దాదాపుగా పది మంది ఈ దాడిలో గాయపడ్డారు.