Home రాజకీయాలు ఎంపీ ల రాజీనామా ఉప ఎన్నికలపై జగన్ చెప్పుదెబ్బ లాంటి సమాధానం!!

ఎంపీ ల రాజీనామా ఉప ఎన్నికలపై జగన్ చెప్పుదెబ్బ లాంటి సమాధానం!!

65
SHARE

అమ్మ పెట్టదు అడ్డుక్కు తిననివ్వదు అన్నట్టు, జగన్ ఎంత మొత్తుకున్నా టీడీపీ ఎంపీ లు లోక్ సభ సభ్యత్వానికి రాజీనామ ససేమిరా చేయమన్నారు. అంతేనా…నో కాన్ఫిడెన్స్ కి కూడా తెదేపా యూ టర్న్ తీసుకున్న విషయం గుర్తుండే ఉంటుంది.

ఇక వైకాపా ఎంపీ లు చెప్పిన్నట్టు రాజీనామా చేసి స్పీకర్ కి రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ను అడగటం కూడా అయింది. అయితే స్పీకర్ రాజీనామాలను అప్రూవ్ చేయకుండా పెండింగ్లో ఉంచారు. అంతే అదేదో వైకాపా డ్రామా అని తెదేపా పాట అందుకుంది. టీడీపీ లో మినిస్టర్ నుంచి పంచాయతీ బోర్డు మెంబెర్ దాకా అదే వెటకారపు స్టేట్మెంటు లు. జగన్ ఈ రోజు వాటికి ఫుల్ స్టాప్ పెట్టారు.

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజక వర్గం మోర్తాలో ఉన్న జగన్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల కు భయపడి రాజీనామాలు ఆమోదించుకోలేదా ఎన్నికలు వస్తే ఎదుర్కుంటారా అనే ప్రశ్నలకు జగన్‌ కత్తిలాంటి సమాధానం ఇచ్చారు… నిజంగా హోదా కోసం తమ ఎంపీలు రాజీనామాలు చేస్తే ఎవరైనా బుద్ధున్న నేతలు వారికి పోటీగా ఆయా పార్లమెంటు నియోజక వర్గాల్లో అభ్యర్థులను నిలబెడతారా అని అడిగారు. ఒకవేళ పెడితే దాని అర్థం ఏంటీ ప్రత్యేక హోదాకు వారు అనుకూలమని అనుకోవాలా లేక హోదాను పట్టించుకోమనా…ఇది నిజంగా కామన్‌సెన్స్‌తో ఆలోచించాలి. ఇంకా జగన్ మాట్లాడుతూ ఒకవేళ చంద్రబాబు అభ్యర్థులను నిలబెడితే అది మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే చంద్రబాబుకి డిపాజిట్లు కూడా రావు కాబట్టి అని అన్నారు.

పిల్లల భవిష్యత్తు, ఉద్యోగాల కోసం చిత్తశుద్ధితో మరో 14 నెలలు ఎంపీలుగా కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ తమ ఎంపీలు రాజీనామాలు చేశారన్నారు. ఆ ఐదు మంది ఎంపీలకు సెల్యూట్‌ చేస్తున్నా. రాజకీయాల్లో నిజాయతీ ఉండాలి. చంద్రబాబుకి లేకపోవడం మన ఖర్మ 14 నెలలకు ముందు రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు రాకుండా ఉంటాయా అని జగన్‌ ప్రశ్నించారు.

ఇంకా జగన్ జంపు జిలానీలపై ఓ బాంబు కూడా వేశారు. తమ పార్టీ టిక్కెట్టు పై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను కొందరికి కండువాలు కప్పి చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నారని మరి వారితో రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికలకు దిగకపోటానికి భయమే కారణామ అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు ఇప్పటివరకు ఎందుకు అనర్హులుగా ప్రకటించలేదు? అని కూడా జగన్ అన్నారు.