Home సినిమా బాహుబలి నిర్మాత ఫైర్ అయ్యాడు!

బాహుబలి నిర్మాత ఫైర్ అయ్యాడు!

68
SHARE
Producer Shobu Yarlagadda @ Baahubali Success Celebrations Stills

రాజమౌళి దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మించిన బాహుబలి ప్రాజెక్టు సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా బాహుబలికి ప్రాజెక్టుకు సంబంధించిన ఓ వార్త నిర్మాతలకు కోపం తెప్పించింది. చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ దీనిపై స్పందించారు.

సుధీర్ఘ కాలం పాటు రామోజీ ఫిల్మ్ సిటీలో బాహుబలి షూటింగ్ జరుపుకున్నందుకు, భారీ సెట్లు వేసుకున్నందుకు రామోజీరావు రూ. 90 కోట్ల బిల్లు వేశారని, ఇంత బిల్లు వేస్తారని ఊహించని బాహుబలి నిర్మాతలు షాకయ్యారని ఓ మీడియా వెబ్ సైట్లో వార్తలు వచ్చాయి.

బాహుబలి నిర్మాతల్లో ఒకరైన శోభు యార్లగడ్డ ట్విట్టర్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేయడం వల్ల మీరు కొందరి దృష్టిని ఆకర్షించవచ్చు. కానీ ఇదే తీరు కొనసాగితే మీ వెబ్ సైట్ గాసిప్ వెబ్ సైట్ అనే ముద్ర పడుతుంది. ప్రజల్లో మీ మీద నమ్మకం పోతుంది. ఇలాంటి ఎల్లో జర్నలిజం ఇప్పటికైనా ఆపండి అంటూ ఫైర్ అయ్యారు.