Home రాజకీయాలు వైఎస్సార్‌ సీపీ ‘రాజీనామాల’కి ఆమోదం

వైఎస్సార్‌ సీపీ ‘రాజీనామాల’కి ఆమోదం

113
SHARE

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాల్ని ఆమోదించేందుకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్అంగీకరించారు. స్పీకర్ ను కలిసి ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి.. మేకపాటి రాజమోహన్ రెడ్డి.. వరప్రసాద్.. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి.. వైఎస్ అవినాష్ రెడ్డిలు ఉన్నారు. ఏపీలోని పరిస్థితిని స్పీకర్ కు వివరించి.. తమ రాజీనామాల్ని ఆమోదించాల్సిందిగా కోరారు. దీంతో.. వారి రాజీనామాల్ని ఆమోదించనున్నట్లుగా స్పీకర్ వెల్లడించారు.

హోదా కోసం తమ పదవుల్ని తృణప్రాయంగా వదులుకున్న ఎంపీలుగా జగన్ పార్టీ నేతలు నిలిచిపోనున్నారు. ఎంపీల రాజీనామాల ఆమోదంపై అధికారిక ప్రకటన ఈ రోజు (బుధవారం) రాత్రికి  రాజీనామాల ఆమోదానికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం రాజీనామాలు చేసిన ఐదుగురు ఎంపీలకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సెల్యూట్‌ చేశారు. పదవులకు ఇంకా 14 నెలలు గడువున్నా రాష్ట్రం కోసం చిత్తశుద్ధితో రాజీనామాలు చేసిన వారికి తాను సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు.