Home రాజకీయాలు మోడీ ప్రభుత్వంలో అతి పెద్ద స్కాండల్ త్వరలో బయటపెడతా!!

మోడీ ప్రభుత్వంలో అతి పెద్ద స్కాండల్ త్వరలో బయటపెడతా!!

SHARE

టీడీపీ-బీజేపీ సంబంధాలు కట్ అయ్యాక రెండు పార్టీలవారు కూడా ఎవరెక్కడ దొరుకుతారా అని ఎదురుచూస్తున్నాయి.  తాజాగా ఎయిర్ ఏసియా కుంభకోణం వ్యవహారంలో చంద్రబాబు పేరు లౌడ్ గా వినపడటంతో కౌంటర్ గా చంద్రబాబు కేంద్రంపై ఆరోపణలకు బెదిరింపులకు దిగుతున్నారు. కేంద్రానికే షాక్ ఇచ్చేలా ఓ భారీ కుంభకోణ౦ విషయాన్ని రెండు నెలల్లో బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు.

కేంద్రం నిధులు ఇస్తామన్నా రాష్ట్రం తీసుకోడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో ఇసుమంత వాస్తవం కూడా లేదని కుటు౦బరావు అన్నారు. ఏపీకి ఎంతో నిధులు ఇచ్చినట్లు చెబుతున్నారని… ఇవి నిజమా కాదా తేలాలంటే కేంద్రానికి చెందిన ఐదుగురు అధికారులు రాష్ట్రానికి చెందిన ఐదుగురు అధికారులను ఒక కమిటీ లా నియమించి పంచనామా చేయించవచ్చు కదా అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఛాలెంజీ చేశారు.

మీడియా స్వాతంత్రం గురించి మాట్లాడుతూ జాతీయ మీడియాను ఎన్డీయే కంట్రోల్లో పెట్టుకుని తమ తప్పులు బయటపడకుండా కప్పిపుచ్చుకుంటోందని ఆయన ఆరోపించారు.

ఎన్డీఏ సహకార సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడుస్తోందని కూడా కుటుంబరావు అన్నారు. బీజేపీ హెడ్ క్వార్టర్స్ కట్టినంత సమయంలో (తొమ్మిది నెలల్లో) ఏపీలో ఏదైనా ఒక్క సంస్థ కట్టండని కుటుంబరావు డిమాండ్ చేశారు. నాలుగేళ్లలో ఏపీలో ఒక్క చిన్న సంస్థను కూడా నిర్మించలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

భాజపా ఆరోపిస్తోందనీ తెదేపా రివర్స్ లో ఆరోపణలు చేయండం, బెదిరింపు రాజాకీయాలు రాష్ట్ర గౌరవానికి మచ్చ తెచ్చిపెడుతున్నాయనేది సత్యం. మొన్నటి దాకా ఎన్డీఏ లో అంటకాగి ఇవ్వాళా బయటకొచ్చి ఈ బెదిరింపులేమిటో…!!