Home రాజకీయాలు పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నాడు: చంద్రబాబు

పవన్ కళ్యాణ్ యూ టర్న్ తీసుకున్నాడు: చంద్రబాబు

79
SHARE

జోక్ అంటే ఇదేనేమో. నెట్టింట జనాలు అంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని యూ టర్న్ అంకుల్ అని ముద్దుగా పిలుచుకుంటుంటే; యూ టర్న్ తీసుకోవడంలో బహు సిద్దహస్తుడైన చంద్రబాబు మాత్రం జనసేన అదినేత పవన్ కళ్యాణ్ పై అదే విమర్శ చేయడం కడు విడ్డూరం.

ఈ రోజు అమలాపురంలో జరిగిన ఓ సబలో చంద్రబాబు మాట్లాడుతూ ఇటీవల కాలంలో జనసేన అధినేత పవన్‌ కూడా తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. మొన్నటి దాకా పవన్ బాగానే ఉన్నారని కానీ సడన్ గా ఇప్పుడే యూటర్న్‌ తీసుకొని మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు.

తాను భాజపాతో విభేదించినప్పట్నుంచి వ్యక్తిగతంగా తనపై, లోకేష్ పై తమ పార్టీపై పార్టీ ఎమ్మెల్యేలపై పవన్‌ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్రం ఏ మాత్రం సహకరించకపోయినా తాను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసుకుంటూ అభివృద్ధి వైపు వెళ్తున్నామే తప్ప ఎక్కడా వెనకడుగు వేయలేదని ముఖ్యమంత్రి అన్నారు.