Home రాజకీయాలు రాజీనామాలు ఆమోదించకపోవడం వెనక అసలు రాజకీయం!!

రాజీనామాలు ఆమోదించకపోవడం వెనక అసలు రాజకీయం!!

SHARE

ఏపీకి ప్రత్యేక హోదా కావాలని గత నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్న వైకాపా నేతలు.. ఆ పోరాటాన్ని తీవ్రతరం చేసే క్రమంలో భాగంగా ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. అప్పటికీ ప్రభుత్వం కరుణించకపోవడంతో.. తమ ఎంపీ పదవులకు రాజినామాలు చేశారు. అయితే లోక్ సభ స్పీకర్ ఆ రాజినామాలను ఎందుకు ఆమోదించలేదు అనేది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ రాజినామాలు ఆమోదిస్తే.. ప్రజల్లోకి వెళ్లి, ప్రత్యేక హోదాపై వారి కోరిక ఎంత బలంగా ఉందో కేంద్రానికి తెలపాలనేది వైకాపా ఎంపీల ప్లాన్. అయితే.. వారి ఆలోచనకు, ప్రజాభిప్రాయాన్ని తెలపాలన్న వారి ఆకాంక్షకు గండి కొట్టారు సుమిత్ర మహజన్. దీనివెనుక ఉన్న కారణాలు ఇవై ఉండొచ్చని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.. అవేమిటో ఇప్పుడు చూద్దాం!

ఏపీలో బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పడంలో ఎవరికీ సందేహాలు ఉండవేమో! 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో ఎలా ఉందో, ప్రస్తుతం బీజేపీ పరిస్థితి కూడా దాదాపుగా అలానే ఉంది! ఈ క్రమంలో అటు టీడీపీతో బీజేపీకి చెడింది అని పైకి చెబుతున్నా… ఇంకా వారిద్దరికీ ఒకరిపై ఒకరికి లోలోపల ఆశలు, బెమలు ఉన్నాయనే సంకేతాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. వీలైంతే కాంగ్రెస్, కాకపోతే చివరాఖరికి బీజేపీతో అయిన చివరి నిమిషంలో రాజకీయ పొత్తు పెట్టుకోవాలనేది బాబు ఆలోచనగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందుకు సాకుగా పెట్టుకునే అంశం.. ప్రత్యేక హోదా! ఎందుకంటే… రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా హోదా ఇవ్వాల్సిందే కేంద్ర ప్రభుత్వమే. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న వారికి ఏ రేంజ్ లో ఒత్తిడి తీసుకొచ్చి హోదా తెచ్చుకోవాలనేది.. రాష్ట్రంలో ఉన్న సమర్ధ పాలనపైనా, ప్రభుత్వం పైనా ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ఇప్పటికే తన అసమర్ధతను, కేంద్రం దగ్గర ఒంగునే తన విధానాన్ని నిరూపించుకుని, రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారు.

ఈ క్రమంలో మిగిలింది వైకాపా మాత్రమే. ఈ క్రమంలో వైకాపా కూడా తాము రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించేశాయి. మరో పక్క బీజేపీకి ఉన్న హోప్.. జనసేన! ఈ సమయంళో.. వైకాపా ఎంపీల రాజినామాలు ఆమోదిస్తే గనుక కచ్చితంగా ఉప ఎన్నికలు వచ్చి ఉండేవి. అవే వస్తే గనుక.. వైకాపా ఎంపీలకు పోటీగా తమ ఎంపీలను రంగంలోకి దింపాలా వద్దా అనే విషయంలో బాబు పరిస్థితి కుడితిలో పడ్డ ఎలకలా ఉండేది. జనసేనది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఆ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనేది కచ్చితంగా పవన్ ను ఇరకాటంలో పెట్టేసే అంశమే! ఈ పరిస్థితుల్లో చంద్రబాబు రాజకీయం బీజేపీ దగ్గర ఇంకా గట్టిగానే పనిచేస్తుంది అనడానికి ఉదాహరణగా… వైకాపా ఎంపీల రాజినామాలు ఆమోదించకుండా చేయడంలో బాబు సక్సెస్ అయ్యారనే అనుకోవాలి.

నిజంగా బీజేపీకి టీడీపీకి చెడితే.. బీజేపీ ఇప్పుడనుకుంటే ఇప్పుడు వైకాపా ఎంపీల రాజినామాలు ఆమోదించొచ్చు. తద్వారా టీడీపీ పరిస్థితి ఏపీలో ఎలా ఉందో ప్రజలకు సంకేతాలు ఇవ్వొచ్చు. కానీ… ఈ తోడు దొంగల రాజకీయ ఆలోచనలో బాగంగా.. వైకాపాకు అంత హైప్ తీసుకురాకూడదనే వీరి నీతి.. నేటి ఈ పరిస్థితికి కారణం అని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇదే విషయాలపై స్పందించిన జగన్… బీజేపీతో చంద్రబాబు కుమ్మక్కై వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదించకుండా అడ్డుకున్నారని ఆరోపించారు కూడా!! ఈ ఒక్క అంశంతో… బాబుకు బీజేపీకి మధ్య ఇంకా అవినాబావ సంబందం ఉందని, వారిద్దరూ కలిసి కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపి, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారని తేటతెల్లమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు!!