Home సినిమా బాహుబలి ని మించి సైరా…!!

బాహుబలి ని మించి సైరా…!!

SHARE

టాలీవుడ్ చరిత్ర లో ఇంత వ‌ర‌కూ యుద్ధాలు యుద్ధ రాజకీయాల ప్ర‌స్తావ‌న వస్తే బాహుబ‌లి గురించి మాట్లాడుకుంటారు. మరి బాహుబ‌లి వార్ సీన్లు ఆ రే౦జి లో అద్దిరిపోలా, హాలీవుడ్ సినిమా కి ఏ మాత్రం తీసి పోనట్టు తీసి చూసిన వారికి చక్కటి అనుభూతి మిగిల్చింది బాహుబలి.

యుద్ధ స‌న్నివేశాలు తీయాలంటే ‘బాహుబ‌లి’ ఓ స్టాండర్డ్ అయిందనే చెప్పాలి. ఇక చిరు సినిమా ‘సైరా’ లో వార్ సన్నివేశాలు వుంటాయని తెలిసిందే. అవి బాహుబ‌లిని మించేలా రూపొందించాల‌న్న త‌ప‌న‌లో సైరా యూనిట్ ఉంది. ప్ర‌స్తుతం వార్ ఎపిసోడ్ల చిత్రీకరణకు రంగం సిద్ధం అవుతోంది. ఈ వారంలో హైద‌రాబాద్‌లో వేసిన ప్ర‌త్యేక‌మైన సెట్లో ‘సైరా’ వార్ ఎపిసోడ్లు తెర‌కెక్కించ‌నున్నారు చిత్ర యూనిట్. ప్రొడ్యూసర్ లు సినిమా స‌గం బ‌డ్జెట్ ఈ యుద్ధ స‌న్నివేశాల‌కి కేటాయి౦చారట. బాహుబ‌లి లో కన్నా‘సైరా’లో యుద్ధాలు త‌క్కువే అయితే ఉన్నవి మాత్ర౦ అంత‌ర్జాతీయ స్థాయిలో తెర‌కెక్కించాల‌ని చిత్ర‌ యూనిట్ భావిస్తోంది.

సైరా కోసం ఇంతకుముందు ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌ షూట్ చేసి అంత‌ర్జాతీయ ఎక్స్పర్ట్స్ తో విజువ‌ల్స్ ఎఫెక్ట్స్ జోడించార‌ట‌. ఆ సీన్ చాలా బాగా వుండదంతి అదే స్ఫూర్తితో ‘వార్ ఎపిసోడ్లు’ చేయాలని సంకల్పించారట. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సైరా చిత్రానికి రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌. న‌య‌న‌తార‌, త‌మ‌న్నా, అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. 2019 వేస‌వికి ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తారు.