Home రాజకీయాలు జేసీ ఇక బాబుకు బానిస!

జేసీ ఇక బాబుకు బానిస!

68
SHARE

ఇంతకాలం సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించే జేసీ దివాకర్ రెడ్డి.. గత కొన్ని రోజులుగా నోటికి అడ్డూ అదుపూ లేకుండా, విజ్ఞత మరిచిన విమర్శలు వైకాపా అధినేత జగన్ పై చేస్తున్నారు. వేదిక ఏదైనా, సందర్భం మరేదైనా… జగన్ ను వ్యక్తిగతంగా విమర్శించడంలో బాబు ట్రంప్ కార్డు జేసీ దివాకర్ రెడ్డి అయిపోయారు. ఇంతకాలం జగన్ ను విమర్శించడంలో యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, కాల శ్రీనివాసులు, బాబూ రాజేంద్ర ప్రసాద్ మొదలైన నాయకుల చేతికి మైకిచ్చే బాబు… గత కొంతకాలంగా జేసీ దివాకర్ రెడ్డికి మైకిస్తున్నారు, కీ ఇచ్చి వదిలేస్తున్నారు. దీనివల్ల పార్టీకి ఎంత లాభం, బాబుకు ఎంత ప్రయోజనం వంటి విషయాలతో పాటు జేసీకి ప్రయోజనమా, నష్టమా.. బాబు ఉచ్చులో జేసీ దివాకర్ రెడ్డి తెలిసి ఇరుక్కుంటున్నారా తెలియక బోర్లా పడుతున్నారా అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

సాదారణంగా రాజకీయాల్లో పార్టీ అధినేలతో చెడితె, ప్రత్యర్ధి పార్టీలోకి జంప్ చేస్తుంటారు నాయకులు. దానికి కచ్చితంగా వ్యక్తిగత కారణాలే కారణాలైనప్పటికీ… కార్యకర్తల కోరిక మేరకు అని ట్యాగ్ లైన్ తగిలించి గోడ దూకేస్తుంటారు. ఇది నైతికమా, అనైతికమా.. ప్రతిసారీ నైతికమేనా, అన్ని సార్లూ అనైతికమేనా అనే విషయాలు ఆయా సందర్భాలు, పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ఈ క్రమంలో టీడీపీలో చేరిన చాలా మంది కాంగ్రెస్ నాయకులు, వైకాపా నాయకులు.. వైకాపాను, అధినేత జగన్ ను విమర్శించడంలో కాస్త ఆచి తూచి వ్యవహరిస్తుంటారు. పార్టీ నిర్ణయాల మేరకు.. జగన్ పై రాజకీయ విమర్శలు చేస్తుంటారు తప్ప, వ్యక్తిగతంగా టార్గెట్ చేయరు. ఎందుకంటే… జగన్ కు శాస్వతంగా దూరం అవ్వాలని సదరు నాయకులు భావించకపోవడమే!

అయితే… ఓడలు బండ్లవుతుంటాయి, బండ్లు ఓడలవుతుంటాయి అన్న విషయం మరిచిన జేసీ దివాకర్ రెడ్డి మాత్రం జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. విజ్ఞత మరిచి రాజకీయలు పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్నారు. దీంతో జేసీ ఫ్యామిలీ జగన్ కు పూర్తిగా దూరమయిపోయినట్లేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో బాబు రాజకీయం, వాడుకుని వదిలేసే పద్దతి తెలిసిన వారు మాత్రం… జేసీ ఇకపై బాబుకు కట్టు బానిస అని విశ్లేషిస్తున్నారు. దానికి కారణం… ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జేసీకి టీడీపీ మినహా మరో ఆప్షన్ లేకుండా చేయడంలో బాబు సక్సెస్ అవ్వడమే!! అవును… ప్రస్తుత పరిస్థితుల్లో జేసీ ఫ్యామిలీ ఇక పూర్తిగా వైకాపాకు, జగన్ కు దూరమయిపోయినట్లే. దీంతో ఆరు నూరైనా చంద్రబాబుకు కనుసన్నల్లోనే జేసీ రాజకీయాలు చేయాల్సి ఉంటుంది.

2019లో జిల్లా మొత్తం పట్టు సంపాదించాలని, అందుకోసం తాను సూచించిన వారికే టీడీపీ టిక్కెట్లు ఇవ్వాలని ఇంతకాలం డిమాండ్ చేసినట్లు కనిపించిన జేసీ దివాకర్ రెడ్డి.. ఇకపై బాబు దగ్గర గొంతు పెంచే సూచనలు లేవు. బాబును రిక్వస్ట్ చేసుకోవాలి, బాబు నో అంటే మూసుకుని కూర్చోవాలి తప్ప.. ప్రత్యర్ధి పార్టీలోకి జంప్ అయిపోతా అనే భయాన్ని ఇకపై బాబుకు జేసీ కల్పించలేరు. కాబట్టి… తిట్టినా, కొట్టినా జేసీ ఇకపై తనవద్దే పడి ఉంటాడనే నమ్మకం బాబుకు పుష్కలంగా వచ్చేసింది. రాబోయే ఎన్నికల్లో జేసీ ఫ్యామిలీకి ఒక ఎంపీ సీటు, ఒక ఎమ్మెల్యే సీటు ఇవ్వడం మినహా బాబు వారికి ఇంక ఏమి చేయకపోయినా కూడా జేసీ దివాకర్ రెడ్డి.. బాబు దగ్గర బానిసలా పడి ఉండాల్సిందే… మరో ఆప్షన్ లేదు మరి! బాబు రాజకీయాలకు బలైన జేసీ, ఇకపై బాబుకు బానిసకాక మరేమిటి?