Home రాజకీయాలు తెదేపా కి పవన్ పై ఇంకా ఆశ చావలేదా?

తెదేపా కి పవన్ పై ఇంకా ఆశ చావలేదా?

64
SHARE

తెలుగుదేశం పార్టీ కి జనసేన నేత పై ఇంకా ఆశ చావనట్టుంది. అందుకే లోకేష్ కూడా జగన్ పై నోరు పారేసుకున్నట్టుగా కాకుండా పవన్ ని మెత్తగా అంటారు. నాయుడు కూడా పవన్ పేరెత్తి ఏమీ అన్నారు. పవన్‌ లోకేష్ అవినీతి పై ఆరోపణలు చేస్తున్నా, నాయుడు కానీ లోకేష్ కానీ పెద్దగా నోటికి పనిచెప్పకుండా ఆచి తూచి మాట్లాడుతున్నారు.

కారణం టీడీపీ అధినేతకు ఇంకా పవన్ పై ఆశ ఉండటమే అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. విశేషమేమిటంటే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ తమతో కలిసి నడిస్తే బాగుంటుందని అనట౦. సునీత మాట్లాడుతూ పవన్‌ కల్యాణ్‌ది యువరక్తమని, యాత్రల పేరుతో సమయం వృథా చేసుకుంటున్నారని అది అనవసర ప్రయాస అని అన్నారు. తమతో కలిసి ముందు నడిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వానికి సలహాలు, సూచనలూ చేసి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వామ్యుడు కావాలని సూచించారు. అయితే ఇది కేవలం తన వ్యక్తిగత అభిప్రాయం అని కూడా సునీత పేర్కొనట౦ విశేషం!!