Home సినిమా నేను సావిత్రిలా అయిపోయేదాన్ని.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

నేను సావిత్రిలా అయిపోయేదాన్ని.. సమంత సెన్సేషనల్ కామెంట్స్

60
SHARE

‘మహానటి’ సినిమా విడుదల తర్వాత సావిత్రి జీవితం ఎలా సాగింది అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. ఈ చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి.

“ఈ చిత్రం తన జీవితంలో మరిచిపోని ఒక చిత్రంగా మిగిలిపోయింది. ఈ సినిమా ద్వారా సావిత్రి జీవితాన్ని అతి దగ్గర నుండి తెలుసుకునే అవకాశం వచ్చింది. తన జీవితం కూడా సావిత్రిలా అయ్యేది, కానీ తృటిలో తప్పించుకుగలిగాను” అని ఆమె చెప్పడం ఇండస్ట్రీలో సంచలనం అయింది.

ఇంతకి ఆమె ఈ మాట అనడానికి వెనుక కారణం మనకి ఇప్పటికే అర్ధమై ఉండాలి. గతంలో ఆమె కథానాయకుడు సిద్ధార్థ్‌తో కొంత కాలం ప్రేమలో ఉండడం అది కాస్త దాదాపుగా పెళ్ళి వరకు వెళ్ళిన సంగతి తెలిసిందే. కారణాలు తెలియనప్పటికి వారు విడిపోవడం ఆ తరువాత చైతన్యతో ప్రేమలో పాడడం పెళ్ళి చేసుకోవడం జరిగిపోయాయి.

ఈ మాటల్ని బట్టి చూస్తుంటే సిద్ధును సమంత జెమిని గణేశన్‌తో పోలుస్తోందన్నమాట. మొత్తానికి ఈ సినిమా ద్వారా తన వ్యక్తిగత జీవితంలో ఎదురైనా అనుభవం కూడా మరోసారి చూడగలిగింది.