Home సినిమా నిఖిల్ “ముద్ర” ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

నిఖిల్ “ముద్ర” ఫస్ట్ లుక్ కు మంచి స్పందన

SHARE

యువహీరో తాజాగా నటిస్తోన్న సినిమా ‘ముద్ర’. ‘ఠాగూర్’ మధు సమర్పిస్తున్న ఈ సినిమాను ఆరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్, మూవీ డైనమిక్స్ ఎల్.ఎల్.పి. బ్యానర్‌లపై కార్య వేణుగోపాల్, రాజ్‌కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిఖిల్ పుట్టినరోజు సంధర్బంగా విడుదల చేసిన ముద్ర ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్ లభించింది. నిఖిల్ ఈ చిత్రంలో రిపోర్టర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ లో నిఖిల్ తన చేతిలో కెమెరాతో కనిపించాడు. జర్నలిజం లో జరిగే కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరుగుతోంది.

టి.ఎన్. సంతోష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి నిఖిల్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. శ్యాం సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాకు సూర్య కెమెరా మెన్ గా వర్క్ చేస్తున్నారు.

నటీనటులు:
నిఖిల్, లావణ్య త్రిపాఠి

సాంకేతిక నిపుణులు:
కథ, దర్శకత్వం: టి.ఎన్. సంతోష్
ప్రెజెంటర్: ఠాగూర్ మధు
నిర్మాతలు: రాజ్ కుమార్ అక్కేల, కవియా వేణు గోపాల్.
బ్యానర్: అవురా సినిమాస్ ప్రవేట్ లిమిటెడ్ & మూవీ డైనమిక్ ఎల్.ఎల్. పి
సంగీతం: శ్యామ్ సి.ఎస్
కెమెరా మెన్: సూర్య
కాస్టూమ్ డిజైనర్: రాగా రెడ్డి
ఆర్ట్ డైరెక్టర్: సహి సురేష్
పి. ఆర్.ఓ: వంశీ శేఖర్