Home ప్రత్యేకం దళితులను ‘నా కొడుకులు’ అంటూ జైసీ తీవ్ర వ్యాఖ్యలు

దళితులను ‘నా కొడుకులు’ అంటూ జైసీ తీవ్ర వ్యాఖ్యలు

SHARE

ఎవ్వర్నీ విడిచిపెట్టకుండా తిట్టిపోయటమే పరమావధి గా బతుకున్న మన అనంత ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా దళితులపై నోరు పారేసుకున్నారు.

మొన్నటికి మొన్న మహానాడు వేదికపై ప్రతిపక్షనేత జగన్ పై జేసీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇంకా సద్దుమణగ లేదు.. జేసీ వ్యాఖ్యలను నిరసిస్తూ అనంతలో వైసీపీ శ్రేణులు జిల్లా వ్యాప్త నిరసనలు తెలిపారు. వైసీపీ ఎస్సీ సెల్ అనంత అధ్యక్షుడు పెన్నా ఓబులేసు ఆధ్వర్యంలో జేసీ దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించారు. జేసీ మండిపడుతూ ఈ సారి దళితులపై వాడరాని పదాన్ని వాడి పెనుదుమారం లేపారు.

అనంత లో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ నా శవయాత్ర చేశారు, అంతమంది కొడుకులు నాకున్నారని తెలీదు, శవాన్ని ఊరేగించి దహనం చేసేది ఆ కొడుకులే, ఈ జిల్లాలో నాకు ఇంతమంది కొడుకులా? ఎప్పుడు కన్నానో నాకే తెలీదు అ౦టూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దళిత సంఘాలు జేసీపై భగ్గుమన్నాయి దళిత జాతిని జైసీ కించపరిచాడని, మహానాడు సభ లో ఎరుకుల కులస్థులను, ఇప్పుడు దళితుల్ని అవమానించాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. జేసీ ని నోరు అదుపులో పెట్టుకోవెలిసింది అని లేకుంటే దళిత జాతి సత్తా చూపిస్తామని దళిత సంఘాలు జేసీని హెచ్చరించాయి.