Home రాజకీయాలు అఖిలప్రియకేమైనా లోకేష్ పూనాడా??

అఖిలప్రియకేమైనా లోకేష్ పూనాడా??

SHARE

చంద్రబాబు నాయుడి కుమారరత్న౦ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ స్పీచ్ తప్పు లేకుండా ఉన్నదంటే విశేషమని చెప్పుకోవాలి. అసందర్భ౦గా అనాలోచిత వ్యాఖ్యలలో లోకేష్ ఓ అవార్డు కట్టబెట్టొచ్చు. పప్పు అని ఆయనని ఎవరు అన్నారో కానీ సార్ధకం చేసుకుంటున్నట్టు ఉంటాయి లోకేష్ బాబు మాటలు.

అయన మాటలకి టీడీపీ మంత్రులు కూడా సైలెంట్ గా నవ్వుకుంటారు. అదేంటో లోకేశ్ బాబును ఆదర్శంగా తీసుకుంటున్నట్లుగా ఉంది టూరిజం మంత్రి భూమా అఖిల ప్రియ.

చంద్రబాబు క్రెడిబులిటీని దెబ్బతీసేలా చేయటానికి కంకణం కట్టు కట్టుకుందాం అని మొన్న లోకేశ్ అన్న సంగతి మర్చిపోకముందే ఇదిగో అఖిల ప్రియ టంగు స్లిప్పు ….అది కూడా ఏకంగా మోదీపై నోరు జారారు.

భయంకరంగా మోడీని ఎవరూ అనని…ఆరోపణలు చేశారు. ఆడాళ్లను రేప్ చేయమని ప్రధాని చెబుతున్నారంటూ అఖిల ప్రియ అన్నారు. ఆమె మాటల్లో: మహిళలు కనిపిస్తే దాడులు చేయండి మానభంగాలు చేయండి అంటూ ప్రధానే ఉసిగొల్పుతున్నారని అఖిల ప్రియ వ్యాఖ్యానించారు.

కర్నూలు జిల్లాలో నవనిర్మాణ దీక్షలో ప్రసంగించిన అఖిల ప్రియ మహిళలు సొంతం గా వారి కాళ్ల మీద నిలబడేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి గారు ఇలా చేస్తుంటే మోడీ మాత్రం మహిళలపై దాడులు అత్యాచారాలు మానభంగం చేయాలంటూ రెచ్చగొట్టి పంపిస్తున్నారని అన్నారు. అఖిలప్రియ వ్యాఖ్యలు దుమారాన్నే రేపాయి. ఎంత టీడీపీ- బీజేపీకి మధ్య సంబంధాలు తెగిపోయినా మరీ ఇలా భయంకరమైన భావజాలం తో పదజాలం తో ప్రధాని మోడీపైనే ఇలాంటి ఆరోపణలు చేయడ౦ ఘోరం!!