Home సినిమా రానాకు క్లిష్టమైన సర్జరీ త్వరలో..

రానాకు క్లిష్టమైన సర్జరీ త్వరలో..

SHARE

రానా దగ్గుబాటి క్లిష్టమైన కంటి సర్జరీ చేయించుకొనేందుకు విదేశాలకు వెళ్లనున్నారు. కుడి కంటిలో తలెత్తిన తీవ్ర సమస్య వల్ల ఇబ్బంది పడుతున్న రానా ఇటీవల వైద్యులను సంప్రదించగా సర్జరీ అవసరమని సూచించినట్టు సమాచారం.

ఓ ఆంగ్ల దినపత్రికతో మాట్లాడుతూ ఆయన తండ్రి సురేష్‌బాబు సమస్య ధ్రువీకరించారు. త్వరలోనే శస్త్ర చికిత్సకు సంబంధించిన ఏర్పాట్లను ఓ దేశంలో చేస్తునట్టు తెలిసింది. రానాకు చిన్నప్పటి నుంచే ఓ కంటిలో చూపులేదనే విషయం తెలిసిందే.