Home సినిమా రివ్యూ రాజుగాడు మూవీ రివ్యూ

రాజుగాడు మూవీ రివ్యూ

SHARE

టైటిల్ : రాజుగాడు
తారాగణం : రాజ్‌ తరుణ్‌, అమైరా దస్తుర్‌, రాజేంద్ర ప్రసాద్‌, నాగినీడు, రావూ రమేష్‌, సితార
సంగీతం : గోపి సుందర్‌
కథ : మారుతి
దర్శకత్వం : సంజన రెడ్డి
నిర్మాత : సుంకర రామబ్రహ్మం

దర్శకురాలు సంజనా రెడ్డి మొదటి సినిమాగా వచ్చిన రాజుగాడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొల్పలేదు కానీ కామెడీతో ఎంటర్ టైన్ చేస్తాడేమో అన్న అభిప్రాయం అయితే కలిగింది. మనసుకు నచ్చింది ద్వారా హీరోయిన్ గా పరిచయమైన అమైరా దస్తూర్ రాజ్ తరుణ్ తో జోడి కట్టగా నిన్ను కోరి ఫేమ్ గోపి సుందర్ సంగీతం అందించాడు. మరి లో  హైప్ లో వచ్చిన రాజుగాడు ప్రేక్షకుల్ మనసులు గెలిచాడా లేదా చూద్దాం.

కథ

రాజు (రాజ్‌ తరుణ్‌) క్లెప్టోమేనియా అనే వితం వ్యాధితో బాధపడుతుంటాడు. తన ప్రమేయం లేకుండానే దొంగతనాలు చేసేలా ప్రేరేపించే ఈ వ్యాధి వల్ల చిన్నతనం నుంచి ఎన్నో ఇబ్బందులు పడుతుంటాడు. రాజుతో పాటు అతని తల్లిదండ్రులు (రాజేంద్ర ప్రసాద్‌, సితార) కూడా రాజు వ్యాధి కారణంగా చాలా ఇంబ్బందులు ఎదుర్కొంటారు. ఇన్ని కష్టాల మధ్య తన్వీ (అమైరా దస్తుర్‌)ని చూసిన రాజు తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ కోసం తన వ్యాధి గురించి దాచి పెట్టి ఆమెకు దగ్గరవుతాడు. తన్వీ ఫ్యామిలీకి కూడా రాజు నచ్చినా ఓ కండిషన్ పెడతారు. తన్వీ తాతయ్య సూర్య నారాయణ (నాగినీడు)కు రాజు నచ్చితేనే పెళ్లి అని, అందుకోసం ఓ పది రోజులు తాతగారి ఊరు రామాపురంలో ఉండాలని కండిషన్‌ పెడతారు. అలా రామపురం వెళ్లిన రాజు కుటుంబం ఎలాంటి పరిస్థితిలను ఎదుర్కొంది..? రాజు వ్యాధి కారణంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి..? అన్నదే మిగత కథ.

ప్లస్‌ పాయింట్స్‌
మూల కథ
కొన్ని కామెడీ సీన్స్‌

మైనస్‌ పాయింట్స్‌
స్లో నేరేషన్‌
ఆశించిన స్థాయిలో వినోదం లేకపోవటం

విశ్లేషణ

భలేభలే మొగాడివోయ్‌, మహానుభావుడు సినిమాలతో విజయం సాధించిన మారుతి అదే తరహా కథను రాజుగాడు కోసం తయారు చేశాడు. కామెడీకి మంచి స్కోప్ ఉన్న స్టోరీ లైన్ ని ప్రేక్షకుడు నవ్వుతూ ఎంజాయ్ చేసేలా చూపించడంలో దర్శకురాలు సంజనా రెడ్డి సక్సెస్‌  కాలేకపోయారు.. అక్కడక్కడా కామెడీ బిట్స్ కొన్ని పర్వాలేదు అనిపించినా అవన్నీ సినిమా మొత్తం భరించే స్థాయిలో లేకపోవడంతో ఏదో ఆశించిన రాజుగాడు ఇంతేనా అని నీరసం తెప్పిస్తాడు.

చాలా చోట్ల కామెడీ కోసం ఇరికించిన సీన్లు బాగా ఇరిటేట్ చేస్తాయి. క్లైమాక్స్ లో వచ్చే కామెడీ యాక్టర్స్ స్పూఫ్ అసలు పేలలేదు. ఫీల్ గుడ్ స్టోరీస్ కి మంచి మ్యూజిక్ ఇచ్చే గోపి సుందర్ దీనికి మాత్రం పేలవమైన అవుట్ ఫుట్ ఇచ్చాడు. అవుట్ అండ్ అవుట్ కామెడీగా చేసిన ప్రయత్నం ఫైనల్ గా గెట్ అవుట్ అనిపించింది.  చివరిగా చెప్పాలంటేనే బాగా ఓపిక తీరిక చేసుకుంటే తప్ప ఇంత నస కామెడీని భరించడం కష్టమే అనిపించేలా ఉన్న రాజుగాడు పోటీలో నెగ్గడం డౌటే.