Home రాజకీయాలు సోనియాపై బాబు… సంచలన వ్యాఖ్యలు!

సోనియాపై బాబు… సంచలన వ్యాఖ్యలు!

73
SHARE

ఏమాట కామాట చెప్పుకోవాలంటే.. రాజకీయాలందు, విలవలందు.. బాబు రాజకీయాలు వేరయా, బాబుకున్న విలువలు వేరయా అని చెప్పుకోవచ్చు!! ఈ మాట చెప్పుకునే పరిస్థితి నిత్యం తానే కల్పిస్తుంటారు చంద్రబాబు! అధికారం దక్కించుకోవడం ముఖ్యం… దానికోసం అనితిక పొత్తులకు, అనాలోచినత నిర్ణయాలకు, దారుణాలకు, అవినీతి పోకడలకు… ఏ విషయంలోనూ వెనకడుకు వేసేది లేదని చెబుతూ ఆ విధంగా ముందుకుపోతుంటారు బాబు! ఈ విషయంలో తాజాగా చంద్రబాబు వైఖరి కాంగ్రెస్ విషయంలోనూ, సోనియా గాంధీ విషయంలోనూ ఎలా ఉందనే విషయంపై క్లారిటీ వచ్చింది!

రాష్ట్ర విభజన పాపంలో తన వాటా ఉన్నా కూడా, జనాలను ఏమార్చే పనిలో భాగంగా.. కాంగ్రెస్ పార్టీని ఉతికి ఉతికి ఆరేశారు చంద్రబాబు! తానేదో సమైక్యవాది అయినట్లుగా.. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టింది అని చెప్పుకొస్తుంటారు. బీజేపీతో కలిసి 2014 ఎన్నిక్ల్లో పోటీ చేసినప్పుడు కూడా ఈ విషయాన్ని కూడా ఒక ప్రధాన అస్త్రంగా చేసుకుని ముందుకు కదిలారు! ఈ క్రమంలో బీజేపీ తో చెడిన తర్వాత ఎవరైతే ఏమిటి.. కేంద్రంలో తనను కాపాడే ఎవరొకరు సాయం కావాలని ఫిక్సయిన చంద్రబాబు చివారాఖరికి కాంగ్రెస్ తో కూడా జతకట్టడానికి రెడీ అయిపోతున్నారని తాజా సంఘటనలు చెబుతున్నాయి. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారం సమయంలో కాంగ్రెస్ పెద్దలతో వేదిక పంచుకున్న బాబు… రాహుల్ స్టైల్లో హస్తం గుర్తు చూపిస్తూ ప్రజలకు అభివాదం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా సోనియా గాంధీ పై స్పందించారు చంద్రబాబు!

తాజాగా.. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ విషయంలో స్పందించిన చంద్రబాబు… “సోనియాతో మాకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ వ్యతిరేక పునాదులపై టీడీపీ ఏర్పడిందని పదేపదే చెప్పే టీడీపీ అధినేత ఇప్పుడు హఠాత్తుగా సోనియాతో వ్యక్తిగత తగాదాలు లేవు అని చెప్పడం చూస్తుంటే… భవిష్యత్ పొత్తులపై తనవైపు పచ్చ జెండా ఊపేసినట్లు భావించవచ్చు! ఇదే క్రమంలో నిన్నమొన్నటి వరకూ కలిసి కాపురం చేసిన బీజేపీని సైతం కాంగ్రెస్ తో పోల్చారు బాబు. ఏపీకి కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీనే ఎక్కువ అన్యాయం చేస్తోందని.. కాంగ్రెస్ సానుభూతి పలుకులు కూడా పలికేస్థాయికి వెళ్లిపోయారు!!

అయితే.. ఇక్కడ బాబు గమనించాల్సింది ఒకటుంది! రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు తప్ప వ్యక్తిగత తగాదాలతో ఉండరు! విలువలు, పార్టీ సిద్దాంతాలే ఇక్కడ విభేదాలు తప్ప.. వ్యక్తిగత కక్షలు ఏ రెండు పార్టీల మధ్యా ఉండవు! ఆ విషయానికొస్తే… జగన్ కు చంద్రబాబు కు మధ్య ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఇప్పుడు ఇన్ని మాటలు అంటున్న మోడీతో చంద్రబాబుకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? వేదికపై కలిసినప్పుడల్లా చిరునవ్వులు చిందించుకునే మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో మాత్రం బాబుకు ఏమైనా వ్యక్తిగత తగాదాలు ఉన్నాయా? ఈ విషయం జనాలు గ్రహించరులే అని భావించిన చంద్రబాబు… రేపో మాపో కాంగ్రెస్ తో కలుస్తాము, సోనియాతో మాకు వ్యక్తిగత తగాదాలు ఏమీ లేవు.. అని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారన్నమాట!!