Home రాజకీయాలు అశోక్ బాబు ముసుగు తీసేసిన చంద్రబాబు!

అశోక్ బాబు ముసుగు తీసేసిన చంద్రబాబు!

77
SHARE

ఎప్పటినుండో చర్చల్లో నలుగుతున్న అంశం, రాజకీయ వర్గాలు అనుమానిస్తున్న అంశం శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షతో నిజం అని తేలిపోయింది! ఏపీఎన్జీవో నేత అశోక్ బాబు.. చంద్రబాబు మనిషని, ఆ బాబు కనుసన్నల్లోనే ఈ బాబు పనిచేస్తుంటారని, ఆ బాబు శాసిస్తారు ఈ బాబు పాటిస్తారు అని రాజకీయ వర్గాలతో పాటు ఇటు ఉద్యోగ సంఘాల నాయకుల్లో కూడా చర్చలు జరుగుతూ ఉండేవి. దీంతో.. అశోక్ బాబు ముసుగు తీయాల్సిన సమయం ఆసన్నమైందనో, లేక ఇప్పటికే ఆలస్యం అయ్యిందనో తెలియదు కానీ.. అశోక్ బాబు ను ఆకాశనికెత్తేస్తూ, పార్టీలోకి పరోక్షంగా ఆహ్వానించేశారు చంద్రబాబు!

విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పార్టీ రాజకీయ ప్రసంగాలు చేసిన చంద్రబాబు.. అదే వేదికపై ఉన్న అశోక్ బాబును ఆకాశానికెత్తేశారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో ఏపీఎన్జీఓ నేత అశోక్ బాబు కీలక పాత్ర వహించారని ప్రశంసించడంతో మొదలుపెట్టీన చంద్రబాబు.. రాజకీయాల్లోకి రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యోగులు చేసిన పోరాటం ఎవరూ మరువలేరని, అదే నిబద్ధతతో ప్రజాజీవితంలోకి అడుగుపెట్టాలని అశోక్ బాబుకు సూచించారు. ఇంతవరకూ వచ్చిన తర్వాత ఇంకా ముసుగులో గుద్దులాట ఎందుకనుకున్నారో ఏమో కానీ… ఆయన ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామంటూ పరోక్షంగా పార్టీలోకి ఆహ్వానించేశారు!

దీంతో… ఇంతకాలం జనాలు చెప్పుకున్న మాటలు, రాజకీయ వర్గాల్లో వెలువడిన అనుమానాలు నిజం అని తేలిపోయింది. గతంలో సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో చంద్రబాబు.. ఏపీలో సమైఖ్యాంద్ర అని, తెలంగాణలో రెండు కళ్ల సిద్దంతం అని చెప్పుకుని తిరిగిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో సమైఖ్యాంధ్ర తరుపున తన మనిషి ఒకరు కాస్త వాయిస్ పెంచాలని, పోరాడుతున్నామనే కలరింగ్ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అశోక్ బాబుని చంద్రబాబే రంగంలోకి దింపారని అప్పట్లో కామెంట్స్ వినిపించాయి. తెరముందు అశోక్ బాబుతో సమైక్యాంధ్ర పోరాటం చేయిస్తూ, తెర వెనుక రాష్ట్ర విభజనకు లేఖలు ఇచ్చారనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలకు దారితీసిన అంశం. దీంతో ఇక నాంచితే బాగోదనే కారణమో లేక వచ్చే ఏడాది అశోక్ బాబు రిటైర్డ్ అయిపోతున్నారనే కారణమో తెలియదు కానీ… పార్టీ కండువా వెయ్యడం మినహా దాదాపుగా అశోక్ బాబుని టీడీపీ నేతను చేసిన విషయాన్ని బహిర్గతం చేశారు చంద్రబాబు!!