Home రాజకీయాలు అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తే జన సేన చూస్తూ ఊరుకోదు

అగ్రిగోల్డ్‌ ఆస్తులు కొట్టేయాలని ప్రయత్నిస్తే జన సేన చూస్తూ ఊరుకోదు

SHARE

అగ్రిగోల్డ్ బాధితులకి జన సేన పార్టీ అండగా ఉంటుందని, అలాగే ఆ సంస్థ ఆస్తులు చౌకగా కొట్టేయాలని టీడీపీ నేతలు ప్రయత్నిస్తే కూడా తమ పార్టీ చూస్తూ ఊరుకోదని, జనసేన ప్రభుత్వం వచ్చాక తిరిగి తీసుకుంటామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు.

విజయనగరం జిల్లా గజపతి నగరంలో జన పోరాట యాత్ర లో పవన్‌ మాట్లాడారు. ఆశా వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ సమస్యలు తీర్చాలని, వారి ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని, జీతాలు సవరించాలని పవన్ డిమాండ్ చేశారు.

పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంటుందని పవన్‌ కల్యాణ్‌ హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్‌ లెక్చరర్లను కూడా పర్మినెంట్‌ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు అండగా నిలబడే ప్రభుత్వం ఉండాలి కానీ ప్రజలని దోచుకునే ప్రభుత్వం ఉండకూడదని పవన్ అన్నారు.