Home రాజకీయాలు ఏపీకి కాంగ్రెస్‌ కంటే ఎక్కువ బీజేపీనే అన్యాయ౦ చేస్తోంది

ఏపీకి కాంగ్రెస్‌ కంటే ఎక్కువ బీజేపీనే అన్యాయ౦ చేస్తోంది

77
SHARE

అదేంటో బాబు సడన్ గా జాతీయ రాజకీయాలు గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో అందరిలా తాను కుప్పిగంతులెయ్యనని నాయుడు అన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ జాతీయ రాజకీయాల పరిస్థితుల గురించి వ్యాఖ్యలు చేశారు. తన పరిధి, పరిమితులు తెలుసని అన్నారు. దేశ౦లోని ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటున్నాయని అన్నారు, ఆయా పార్టీలు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని కూడా అన్నారు

ఇక, ఒక పార్టీకి ప్రజలు పట్టం కట్టాక అది వారి ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చక పోతే ప్రజలు పార్టీ పై నమ్మకం కోల్పోతారని బాబు అన్నారు. అదే ఎన్డీఏ విషయంలో జరుగుతోందనీ, కర్ణాటకలో బీజేపీ చేసింది చట్టవ్యతిరేకమని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించిందని చంద్రబాబు అన్నారు. తాజాగా ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమి కూడా ప్రజల సెంటిమెంట్‌కు ప్రతిబింబంగా నిలిచిందని వ్యాఖ్యానించారు.

ఇంకా దేశ౦ కోసం దెస శ్రేయస్సు కోసం అన్ని పార్టీలు కలవాలని పిలుపునిచ్చారు. తాను జాతీయ రాజకీయాలలో ఎప్పుడేం చేస్తానో చెప్పాననీ ప్రజలే చూస్తారని బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ని కాపాడుతున్నారా అని అనిపించేలా ఏపీ కి కాంగ్రెస్ కంటే ఎక్కువ అన్యాయం బీజేపీనే చేస్తోందని ఆరోపించారు.

అయినా భాజపా కర్ణాటక లో ఎంఎల్ఏ లను కొనుగోలు చేయటం ఎలా పట్టుకున్నారు? ఆడియో టేపుల్లో బాబు దొరికినట్టు కాదు కాదా? సూటుకేసుల్లో నోట్ల కట్టలతో రేవంత్ రెడ్డి ల కాదు కాదా…!!