Home సినిమా మహేష్ కి ఛాలెంజ్ విసిరిన ఎన్ఠీఆర్!

మహేష్ కి ఛాలెంజ్ విసిరిన ఎన్ఠీఆర్!

65
SHARE

ఈ సోషల్ మీడియా లో ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ గోల తెలిసిందే. విరాట్ కోహ్లీ ప్రధాన మంత్రి కి ఫిట్నెస్ ఛాలెంజ్ ఇవ్వటం, పీఎం వీడియో పంపుతానని రిప్లై ఇవ్వటం చూసాం. ప్రతిపక్షం దీన్నో రాదాంతం కూడా చేసింది. పెట్రోల్ ఛాలెంజ్ విసిరింది; ధరల తరుగుదల ఛాలెంజ్ విసిరింది.

సరే ఆ విషయం అటుంచి ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ ట్రెండ్ సినిమా వాళ్ళని బాగా ఆకట్టుకుంది. సినీనటుడు మోహన్ లాల్ యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫిట్‌ నెస్‌ ఛాలెంజ్‌ ఇచ్చారు. ఆయన ఛాలెంజ్‌ను స్వీకరించిన తారక్‌ ఈరోజు జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. తాను మామూలుగానే తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తానని చెప్పాడు.

అయితే తారక్ మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు ‘హమ్ ఫిట్ తో ఇండియా ఫిట్’ ఛాలెంజ్ చేశారు. రామ్‌ చరణ్‌ ఇంకా ట్విట్టర్ పిట్ట కానందున తన ఛాలెంజ్‌ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు. కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ మొట్ట మొదటగా ఈ ఛాలెంజ్ ప్రారంభించారు.