Home రాజకీయాలు జగన్ ముఖ్యమంత్రి తప్పక అవుతారు: సూపర్ స్టార్ కృష్ణ!

జగన్ ముఖ్యమంత్రి తప్పక అవుతారు: సూపర్ స్టార్ కృష్ణ!

SHARE

విపక్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ముఖ్యమంత్రి అవటం ఖాయమని ప్రముఖ నటుడు, మాజీ ఎమ్.పి ఘట్టమనేని కృష్ణ అన్నారు.

ఒక ఇంటర్వ్యూ లో మాటలాడుతూ తన సినిమా కెరీర్ పైన, సమకాలీన రాజకీయ అంశాలపైన స్పందించారు. వారి ఇంటిలో వైఎస్ రాజశేఖరరెడ్డి పోటో ఎందుకు వుంది అని ప్రశ్న అడగగా, ఆయన తనకు మంచి మిత్రుడని అన్నారు. పైగా ముఖ్యమంత్రిగా మంచి పేరు తెచ్చుకున్నారని, వైస్సార్ చేపట్టిన ఆరోగ్యశ్రీ, పీజ్ రీయింబర్స్ మెంట్ వంటి పదకాలు ప్రజల ఆదరణ చూరగొన్నాయని కృష్ణ అన్నారు. అలానే ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని అనుకుంటారని ఆయన అన్నారు.

జగన్ పాదయాత్రపై అయన అభిప్రాయం అడగగా జగన్ బాగా కష్టపడుతున్నారని, ప్రజలలో కూడా మంచి స్పందన కనబడుతోందని కృష్ణ వ్యాఖ్యానించారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారా అని ప్రశ్నించగా ఎందుకు ఎవరని అన్నారు. అలానే తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పాలన బాగుందని కితాబు ఇచ్చారు. అయితే తన సోదరుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ ,అల్లుడు టిడిపి వ్యక్తులు అయినా తాను మాత్రం ఏ పార్టీకి చెందిన వాడిని కానని అన్నారు.

కేవలం రాజీవ్ గా౦ధీ గారి కోరిక మేరకు ఎమ్.పి గా పోటీ చేశానని కృష్ణ చెప్పారు.