Home రాజకీయాలు నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలేనా??

నిరుద్యోగ భృతి వెయ్యి రూపాయలేనా??

101
SHARE

ఎన్నికలు ఇంకా సంవత్సర కాలం ఉండటంతో ఎపి ప్రబుత్వం నిరుద్యోగ భృతి పై మేల్కొంది. నిరుద్యోగ భృతి గురించి కీలక ప్రకటన చేసింది. మంత్రివర్గ నిర్ణయం ప్రకారం నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున బృతి చెల్లించాలని నిర్ణయించినట్లు ఐటీ మంత్రి లోకేష్ ఈ సయాంకాలం మీడియాకు చెప్పారు.

రాష్ట్ర వ్యాప్తంగా పది లక్షల మంది నిరుద్యోగులకు ఈ భృతిని అందించనున్నట్లు లోకేష్ తెలిపారు. అలానే ఒక కుటుంబంలో ఇద్దరికి నిరుద్యోగ భృతిని అందజేస్తామని చెప్పారు. అయితే ఈ భృతి కి కనీస విద్యార్హత డిగ్రీ అయినా లేదా డిప్లొమా అయినా చేసి ఉండాలని చెప్పారు.

మనం గుర్తు చేసుకున్నట్లయితే 2014 ఎన్నికలకు ముందు టీడీపీ మేనిఫెస్టోలో నిరుద్యోగులకు రూ. 2 వేలు భృతి హామీ ఇచ్చారు. ఇక భృతి చెల్లింపు కోసం 7 దేశాల్లో నిరుద్యోగ భృతి పథకం అమలు విషయాన్ని స్టడీ చేసినట్టు లోకేశ్‌ చెప్పారు. ఈ పధకం కేవలం పేదరికంలో ఉన్నవారకే వర్తిస్తుందని లోకేష్ అన్నారు.