Home రాజకీయాలు బాబు చేతుల్లో మాజీ జేడీ ఫ్యూచర్!

బాబు చేతుల్లో మాజీ జేడీ ఫ్యూచర్!

68
SHARE

సీబీఐ మాజీ జాఇంట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ.. ఉద్యోగానికి వాలంటరీ రిటైర్‌మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం జిల్లాల్లో సమస్యలు తెలుసుకుంటానని చెప్పి పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో… లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి వస్తున్నారని గాసిప్పులు మొదలైపోయాయి. వీటికి తగ్గట్టుగానే… గతంలో ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఏ విషయమైనా రెండు నెలల సమయం అనంతరం వెళ్లడిస్తానని తెలిపారు. అయితే.. తాజాగా తన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ పరోక్షంగా చంద్రబాబు చేతుల్లోనూ, చేతల్లోనూ ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు లక్ష్మీనారాయణ!

తన రాజకీయ ప్రయాణం గురించి తాజాగా స్పందించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ.. కీలక విషయాలే వెల్లడించారనుకోవాలి. తన భవిష్యత్ ప్రయాణం ఎటు అనేది ప్రభుత్వ స్పందనపైనే ఆధారపడి ఉంటుందని, తన ఫ్యూచర్ ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. మీడియాతో మాట్లాడుతూ… ప్రజా సమస్యలపై అధ్యయనం కోసం పర్యటిస్తున్నానని.. అధ్యయనం అనంతరం ప్రభుత్వం ముందు ప్రజా సమస్యలను ఉంచుతానని, ప్రభుత్వం ఆ సమస్యలను పరిష్కరిస్తే ఒకలా.. పరిష్కరించని పక్షంలో మరోలా తన పయనం ఉంటుందని స్పష్టం చేశారు.

దీంతో.. రాజకీయ విశ్లేషకులు ఇక్కడ రెండు రకాల ఆలోచనలు చేస్తున్నారు! లక్ష్మీ నారాయణ ఫ్యూచర్ లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు నెలకొన్నా, అలాంటి ఆలోచనలు చేసినా… తన అధ్యయనం అనంతరం సమర్పించిన నివేధికపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారని.. అందుకే తన మద్దతు టీడీపీకి అని చెప్పబోతున్నారు! అలా కాకుండా.. జనసేనతో దోస్తీ కట్టేఆలోచన చేస్తే… తాను ప్రభుత్వం ముందుంచిన ప్రజాసమస్యలపై చంద్రబాబు సానుకూలంగా స్పందించలేదని చెప్పబోతున్నారు అని!! ఈ రెండు మినహా… లక్ష్మీ నారాయణ రెండు నెలల అనంతరం చెప్పబోయే విషయంలో మరొకటి ఉండదనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది!!