Home రాజకీయాలు బీసీలు జడ్జీలు కాకూడదనేది బాబు నీచ ఆలోచనకి పరాకాష్ట!

బీసీలు జడ్జీలు కాకూడదనేది బాబు నీచ ఆలోచనకి పరాకాష్ట!

SHARE

అబద్దాలు చెప్పడం, మోసాలు చేయడం వీటిల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్‌ వన్‌గా నిలిచారని వైకాపా అధినేత జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన భారీ ర్యాలీలో మాట్లాడిన జగన్ తెలుగు దేశం పార్టీ నిర్వహించిన మహానాడు దుయ్యబట్టారు.

మూడు రోజులపాటు అంతర్జాతీయ అబద్దాల పోటీ జరిగిందని మహానాడు ను ఉద్దేశించి అన్నారు. అలానే బాబు బీసీలు జడ్జీలు కాకూడదంటూ లేఖలు రాశారు అని గుర్తు చేసి ఇదీ బాబుకి బీసీలపై ఉన్న ప్రేమ అన్నారు. ఎలానూ తెలంగాణలో అధికారంలోకి రారని తెలిసి.. అక్కడ అధికారంలోకి వస్తే బీసీ ని ముఖ్యమంత్రి ని చేస్తానని వాగ్ధానం చేసారని అన్నారు. అలానే ఎస్సీ, ఎస్టీలు, బీసీలకు తెలంగాణలో 12 మంత్రి పదవులు ఇస్తానని బాబు అనటం గుర్తు చేశారు.

ఏపీలో అధికారంలో ఉండీ ఆయా సామాజిక వర్గాల నేతలకు ఒక్కటంటే ఒక్క మంత్రి పదవయినా ఇచ్చిన పాపాన పోలేదు అన్నారు. బాబులా మోసం చేసేవారు ఇంకెవరైనా ప్రపంచంలో ఉన్నారా అని జగన్‌ అన్నారు.